సైలెంట్‌గా అప్‌డేటెడ్ హ్యందాయ్ వెర్నా సెడాన్ విడుదల
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ, త్వరలో అప్‌గ్రేడెడ్ వెర్నా సెడాన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, హ్యుందాయ్ సైలెంట్‌గా ఈ అప్‌గ్రేడెడ్ వెర్నా సెడాన్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది.
తమ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త వెర్నాకు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేసింది. అంతేకాకుండా, ఇప్పటికే ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా డీలర్‌షిప్ కేంద్రాలకు చేరిపోయినట్లు సమాచారం.
అప్‌గ్రేడెడ్ వెర్నా సెడాన్‌లో ప్రధానంగా, బ్యాక్-లిట్ పవర్ విండో స్విచ్‌లు, బ్యాక్-లిట్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ (టాప్ ఎండ్ వేరియంట్లలో), రీస్టయిల్ చేయబడిన అల్లాయ్ వీల్స్, స్టీల్ రిమ్ స్పేర్ వీల్ (ఇదివరకు అల్లాయ్ వీల్ ఉండేది), వెనుక సీట్లలో రెండు హెడ్ రెస్ట్స్ (ప్రస్తుతం 3 ఉన్నాయి) వంటి మార్పులు చేర్పులు ఉన్నాయి.
ఇవేకాకుండా, టాప్ ఎండ్ వేరియంట్ వెర్నాలో హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారులో కంపెనీ ఆఫర్ చేస్తున్న డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్లను ఈ కొత్త అప్‌డేటెడ్ హ్యుందాయ్ వెర్నాలో కూడా ఆఫర్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








