ఉచిత కార్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించిన హ్యుందాయ్

By Ravi

Hyundai Launches 14th Nationwide Free Car Care Clinic
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ వినియోగదారుల కోసం '14వ నేషన్‌వైడ్ ఫ్రీ కార్ కేర్ క్లినిక్'ను ప్రారంభించింది. హ్యుందాయ్ కార్ల వినియోగదారులకు తమ ఉత్తమ సర్వీస్ ప్రయోజనాలను అందించేందుకు మార్చి 15, 2013 నుంచి మార్చి 24, 2013 వరకూ ఈ ఉచిత సర్వీస్ క్యాంప్ కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా ఉ్నన 900 సర్వీస్ అవుట్‌లెట్లలో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

తమ వినియోగదారుల అవసరాలను, ఎంపికలను తాము అర్థం చేసుకుంటామని, తమ 'ఫ్రీ కార్ కేర్ క్లినిక్'కు మంచి స్పందన లభిస్తోందని, ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులు ఈ సర్వీస్ క్యాంప్‌లో పాల్గొంటారని తాము అంచనా వేస్తున్నామని ఈ క్యాంపైన్ ప్రారంభించిన సందర్భంగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా జిఎమ్, గ్రూప్ హెడ్ - మార్కెటింగ్ నళిన్ కపూర్ తెలిపారు.

ఈ ఉచిత కార్ క్లినిక్‌కు వినియోగదారులు తీసుకువచ్చే హ్యుందాయ్ కార్లకు ఇంజన్, ట్రాన్సిమిషన్, ఎలక్ట్రికల్ సిస్టమ్, అండర్ బాడీ, ఏసి, ఎక్స్టీరియర్స్ మొదలైన 80 పాయింట్ చెకప్‌ను ఉచితంగా చేసి ఏవైనా లోపాలు ఉంటే సరిచేస్తారు. అంతేకాకుండా, ఈ క్యాంపైన్ సమయంలో వినియోగదారులు విడిభాగాలు, స్పేర్ పార్ట్స్, ఎంపిక చేసిన యాక్ససరీలు లేబర్ ఛార్జీలు మరియు ఇతర వ్యాల్యూ యాడెడ్ సర్వీసులపై ఆకర్షనీయమైన తగ్గింపులను కూడా పొందవచ్చు.

అంతేకాకుండా, అదనపు వారంటీపై 20 శాతం వరకూ తగ్గింపు, లేబర్ ఛార్జీలపై అదనపు తగ్గింపులు, పాత కార్ల ఎక్సేంజ్‌పై ఆకర్షనీయమైన ఆఫర్స్ మరియు మహిళా కార్ ఓనర్లకు రివార్డులను కూడా ఆఫర్ చేస్తున్నామని హ్యుందాయ్ పేర్కొంది. 4 ఏళ్లకు పైగా హ్యుందాయ్ కార్లను వినియోగిస్తున్న కస్టమర్లకు మరిన్ని అదనపు ఆఫర్లను, ఈ క్యాంప్‌కు విచ్చేసే కస్టమర్లకు ఆకర్షనీయమైన బహుమతులను అందిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఉచిత సర్వీస్ క్యాంప్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలో అధీకృత హ్యుందాయ్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2013, 11:05 [IST]
English summary
Hyundai Motor India Ltd. (HMIL) has announced the 14thedition of the nationwide ‘Free Car Care Clinic’ customer connect programme. Aimed at extending the advantage of its excellent services to its customers, the camp will be held from March 15 - 24, 2013 at over 900 Service Outlets across the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+