7వ ఎడిషన్ హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్ క్యాంపైన్

ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ 7వ ఎడిషన్ ఆల్వేస్ అరౌండ్ క్యాంపైన్‌లో భాగంగా, ఈ సర్వీస్ క్యాంప్‌కు కస్టమర్లు తీసుకువచ్చే తమ హ్యుందాయ్ వాహనాలకు ఉచిత చెకప్ నిర్వహిస్తామని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నామని హ్యుందాయ్ వెల్లడించింది. గతేడాది మొత్తం 6,962 ప్రాంతాల్లో ఈ ఉచిత సర్వీస్ క్యాంప్‌ను నిర్వహించామని కంపెనీ తెలిపింది.
కాగా.. ఈ ఏడాది మరింత విస్తృత స్థాయిలో హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్ సర్వీస్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ఈ ఉచిత సర్వీస్ క్యాంప్ ఈ ఏడాది చివరి వరకూ సాగుతుంది. డిసెంబర్ 2013 చివరి నాటికి దేశవ్యాప్తంగా 7,000 లకు పైగా ప్రాంతాల్లో దాదాపు 1,50,000 మంది కస్టమర్ల వద్దకు ఈ సేవలను తీసుకువెళ్లాలని హ్యుందాయ్ సన్నాహాలు చేస్తుంది.
ఈసారి కూడా తమ సర్వీస్ క్యాంప్‌ను కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా కస్టమర్లు ఎక్కడ ఉంటే అక్కడకు అంటే జాగర్స్ పార్క్, షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్సెస్, ఎంపిక చేసిన నివాస స్థలాలు మొదలైన చోట్ల దీనిని నిర్వహించాలని హ్యుందాయ్ ప్రతిపాదించింది.
హ్యుందాయ్ ఆల్వేస్ అరౌండ్ యూ క్యాంపైన్‌కు విచ్చేసే వాహనాలకు 18-పాయింట్ ఫ్రీ చెకప్ చేసి, లోపాలు ఏవైనా ఉంటే సరిచేస్తామని, ఆయిల్ టాప్అప్స్, వెహికల్ ఎగ్జామినేషన్, కూలెంట్ టాప్అప్, వెహికల్ పాలిషింగ్ వంటివి నిర్వహిస్తామని, ఏవైనా స్పేర్ పార్ట్‌లు మార్చాల్సి వస్తే, మార్కెట్ ధరల కన్నా సరసమైన ధరలకే వాటిని తమ కస్టమర్లకు అందిస్తామని హ్యుందాయ్ పేర్కొంది. ఈ సర్వీస్ క్యాంప్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మీ సమీపంలోని హ్యుందాయ్ అధీకృత డీలర్ నుంచి పొందవచ్చు.


Click it and Unblock the Notifications








