'హ్యుందాయ్ కేర్' సర్వీస్ మొబైల్ అప్లికేషన్ విడుదల
దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య నానాటికీ గణనీయంగా పెరిగిపోతున్న సంగతి తెలిసినదే, ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, తమ కస్టమర్లకు స్మార్ట్ సేవలను అందించేందుకు ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. 'హ్యుందాయ్ కేర్' (Hyundai Care) పేరుతో కంపెనీ ఓ సర్వీస్ మొబైల్ అప్లికేషన్‌ను పరిచయం చేసింది.
ఈ అప్లికేషన్ ద్వారా హ్యుందాయ్ తమ కస్టమర్లకు సర్వీస్ సపోర్ట్, సర్వీస్ నెట్‌వర్క్, కార్ సర్వీస్ క్యాలుక్యులేటర్, సర్వీస్ అపాయింట్‍మెంట్ మొదలైన సేవలను అందించనుంది. ఈ అప్లికేషన్‌ను అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేసే స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తం చేసుకోవచ్చు. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐస్టోర్‍ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ కేర్ మొబైల్ అప్లికేషన్ హైలైట్స్:
- సర్వీస్ అపాయింట్‌మెంట్
- జిపిఎస్ ఆధారిత డీలర్ లొకేటర్
- సర్వీస్ హిస్టరీ
- కార్ సర్వీస్ క్యాలుక్యులేటర్, లేబర్ ఎస్టిమేట్స్
- సర్వీస్ రిమైండర్
- ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్
- హ్యుందాయ్ ఎమర్జెన్సీ రోడ్ సర్వీసుల కోసం వన్ కాల్ కనెక్ట్
- క్యాంపైన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇన్‌బాక్స్
- జిపిఎస్ ఆధారిత యాక్సిలరోమీటర్ (ట్రిప్ సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది)
- ఫీడ్‌బ్యాక్


Click it and Unblock the Notifications








