కార్ల ధరలను పెంచిన హ్యుందాయ్; ఏయే మోడల్‌పై ఎంత?

By Ravi

Hyundai
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా మరోసారి తమ ఉత్పత్తుల ధరలను పెంచింది. ఓబిడిసి (ఆన్ బోర్డ్ డయోగ్నోస్టిక్ కంప్లయన్స్ ఛేంజెస్) వలన ధరలను పెంచాల్సి వస్తోందని, ఈ పెంపు మోడల్‌ను బట్టి రూ.575 నుంచి రూ.2830 రేంజ్‌లో ఉంటుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెండ్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.

తమ వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా ఉండేలా, అధిక భారాన్ని తమపై వేసుకొని, పాక్షికంగా మాత్రమే వినియోగదారులపై మోపుతున్నామని ఆయన తెలిపారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2013 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సంవత్సరంలో హ్యుందాయ్ తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ఇది రెండవసారి. గడచిన ఫిబ్రవరి నెలలో హ్యుందాయ్ తమ చిన్న కారు ఇయాన్ మొదలుకొని ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకూ అన్ని మోడళ్ల ధరలను రూ.4,201 నుంచి రూ.20,878 రేంజ్‌లో పెంచిన సంగతి తెలిసినదే.

వివిధ మోడళ్లపై హ్యుందాయ్ పెంచిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • హ్యుందాయ్ ఇయాన్ (పెట్రోల్) - రూ.2,500
  • హ్యుందాయ్ శాంత్రో (పెట్రోల్) - రూ.2,830
  • హ్యుందాయ్ ఐ10 (పెట్రోల్) - రూ.600 నుంచి రూ.900 వరకూ
  • హ్యుందాయ్ ఐ20 (పెట్రోల్/డీజిల్) - రూ.575
  • హ్యుందాయ్ వెర్నా (పెట్రోల్/డీజిల్) - రూ.1,340
  • హ్యుందాయ్ ఎలాంట్రా (పెట్రోల్/డీజిల్) - రూ.1,740
  • హ్యుందాయ్ సొనాటా (పెట్రోల్) - రూ.2,813
  • హ్యుందాయ్ శాంటాఫే (డీజిల్) - రూ.2,813

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2013, 14:06 [IST]
English summary
Hyundai Motor India Ltd. (HMIL), the country’s largest passenger car exporter and second largest car manufacturer today announced the price increase on across all its models starting from Eon to Santa Fe. Increase in the prices in the range of INR 575 to INR 2830 across all the models. The price increase across all the models would come with immediate effect i.e. April 1, 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+