హ్యుందాయ్ పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్ ఈ4యూ
ఇదేం చోద్యం..కోడి గుడ్డు కారేంటనుకుంటున్నారా..? భవిష్యత్ రవణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి వివిధ రకాల పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్ వాహనాలను రూపొందిస్తున్న సంగతి తెలిసినదే. ఇదే కోవలోనే కొరియాకు చెందిన కార్ కంపెనీ హ్యుందాయ్ కోడి గుడ్డు ఆకారంలో ఉండే ఓ సరికొత్త వాహనాన్ని అభివృద్ధి చేసింది.
పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనం పేరు 'ఈ4యూ' (ఈ ఫర్ యూ అని పలకాలి). సియోల్‌లో జరుగుతున్న మోటార్ షోలో హ్యుందాయ్ ఈ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. బ్యాటరీ పవర్‌తో నడిచే ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇరుకైన పార్కింగ్ ప్రదేశాలలో సులువుగా ప్రయాణించేందుకు, పొడవాటి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకోకుండా ఎంచక్కా ప్రయాణించేందుకు ఇది సహకరిస్తుంది.
హ్యుందాయ్ ఈ4యూ ఎలక్ట్రిక్ వాహనం గంటకు గరిష్టంగా 18 మైళ్ల వేగంతో (సుమారు 30 కిలోమీటర్ల) పరుగులు తీస్తుంది. ఈ వాహనపు పై భాగం విజర్ మాదిరిగాను, హెల్మెట్ మాదిరిగాను పనిచేస్తుంది. హ్యుందాయ్ ఈ4యూ పేరులో ఎవల్యూషన్, ఎలక్ట్రిసిటీ, ఎకో-ఫ్రెండ్లీ, ఎగ్ అనే నాలుగు 'ఈ'ల నుంచి స్ఫూర్తి పొంది దీనిని డిజైన్ చేశారు. ఇది 24 వోల్డ్, 500-వాట్ బ్యాటరీతో నడుస్తుంది. మరి ఈ కోడి గుడ్డు కారుపై ఓ కన్నేసొద్దాం రండి..!

హ్యుందాయ్ ఈ4యూ

హ్యుందాయ్ ఈ4యూ

హ్యుందాయ్ ఈ4యూ

హ్యుందాయ్ ఈ4యూ

హ్యుందాయ్ ఈ4యూ

హ్యుందాయ్ ఈ4యూ

హ్యుందాయ్ ఈ4యూ

హ్యుందాయ్ ఈ4యూ



Click it and Unblock the Notifications








