హ్యుందాయ్ శాంత్రో స్థానాన్ని భర్తీ చేయనున్న కియా రే!?

By Ravi

హ్యుందాయ్ నుంచి అత్యంత సక్సెస్ అయిన ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ 'శాంత్రో' స్థానాన్ని ఓ కొత్త మోడల్‌తో రీప్లేస్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నాయని పుకార్లు గుప్పుమన్నాయి. ప్రస్తుతం భారత స్మాల్ కార్ సెగ్మెంట్లో కొత్త మోడళ్ల రాకతో పోటీ పెరగటం, శాంత్రో డిజైన్ అవుట్‌డేటెడ్‌గా అనిపిస్తుండటంతో, విపణిలో ఈ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ తమ శాంత్రో స్థానాన్ని ఓ సరికొత్త మోడల్‌తో రీప్లేస్ చేయటం లేదా ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురావటం చేసే అవకాశాలున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కార్పోరేషన్ తమ స్వంత దేశంలో (సౌత్ కొరియా) అందిస్తున్న పాపులర్ స్మాల్ కార్ బ్రాండ్ కియాను ఇండియాకు తీసుకు రానున్నట్లు సమాచారం.

ఆటోకార్ ప్రచురించిన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి అందిస్తున్న ఎత్తైన కారు వ్యాగన్ఆర్ మాదిరిగా హ్యుందాయ్ దక్షిణ కొరియాలో అందిస్తున్న కియా రే అనే కారును ఇండియాకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్‌కు చెందిన కియా సౌత్ కొరియాలో రెండవ అతిపెద్ద కార్ బ్రాండ్. అయితే, కియా రే కారును ఇండియాకు తీసుకువచ్చే సాధ్యాసాధ్యాలపై పలు సవాళ్లు హ్యుందాయ్ ముందున్నాయి.

Kia Ray

హ్యుందాయ్‌కు కియా స్వంత బ్రాండ్ అయినప్పటికీ, అది వ్యక్తిగతంగానే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒకవేళ హ్యుందాయ్ తమ కియా రే కారును ఇండియాకు తీసుకువచ్చి, తమ బ్యాడ్జ్‌తో విక్రయించినప్పటికీ, కియాకు హ్యుందాయ్ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా దీని ధర కూడా అధికంగా ఉండే ఆస్కారం ఉంది. అంటే, కియా రే హ్యుందాయ్ శాంత్రో ధరలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

అయితే, కియానే స్వతహాగా ఓ వ్యక్తిగత బ్రాండ్‌గా ఇండియాకు వస్తుందనే పుకార్లు ఉన్నాయి. ఇదే గనుక జరిగితే కియా రే శాంత్రో కన్నా తక్కువ ధరకే లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కియా రే హ్యుందాయ్ శాంత్రోకు రీప్లేస్‌మెంట్ కాకపోవచ్చు. ఏదేమైనప్పటికీ, హ్యుందాయ్ నుంచి ఓ సరికొత్త చిన్న కారు భారత మార్కెట్లోకి రావటం మాత్రం ఖాయమని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 28, 2013, 12:13 [IST]
English summary
Fitting in Santro's proverbial shoes won't be an easy task and Hyundai is said to considering bringing in another tall boy to do the job. According to AutoCar, which broke the story, taking the Santro's place will be the Kia Ray, a boxy hatchback, with a tall boy design that's not sold anywhere outside South Korea.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+