ఎక్స్‌ట్రీమ్ అంబులెన్స్‌ను విడుదల చేసిన ఐసిఎమ్ఎల్

By Ravi

ప్రముఖ ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ సోనాలికా గ్రూపుకు చెందిన ప్యాసింజర్ వాహనాల విభాగం ఇంటర్నేషనల్ కార్స్ అండ్ మోటార్స్ లిమిటెడ్ (ఎసిఎమ్ఎల్), హాస్పిటల్స్ ఉపయోగార్థం ఓ అధునాతన అంబులెన్స్ వాహనాన్ని విడుదల చేసింది. 'ఎక్స్‌ట్రీమ్ అంబులెన్స్' పేరుతో లభ్యం కానున్న ఈ అంబులెన్స్ ఏసి, నాన్ ఏసి వేరియంట్లలో లభిస్తుంది.

ఇది భారతదేశపు అత్యంత శక్తివంతమైన అంబులెన్స్ అని కంపెనీ పేర్కొంది. దేశీయ విపణిలో ఎక్స్‌ట్రీమ్ అంబులెన్స్ ధరలు రూ.6.15 లక్షల నుంచి రూ.6.58 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ అంబులెన్స్‌లో 120 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ 4-సిలిండర్, టర్బోఛార్జ్‌‌డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. దీని గరిష్ట వేగం గంటకు 165 కిలోమీటర్లు.

ఇందులో పవర్‌ఫుల్ ఇంజన్‌తో పాటుగా, సాధారణ అంబులెన్స్‌లో ఉండే అన్ని సదుపాయాలు లభ్యం కానున్నాయి. 4.1 సీటింగ్ కెపాసిటీ, ఓ స్ట్రెచర్, రివాల్వింగ్ లైట్, గ్లూకోజ్ బాటిల్ హుక్, ఆక్సిజెన్ సిలిండర్ హోల్డర్, వాటర్ డిస్పెన్సర్ హోల్డర్, మెడికల్ మొదలైన వాటిని ఇందులో ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2013 నుంచి ఎక్స్‌ట్రీమ్ అంబులెన్స్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

ICML Extreme Ambulance

More from DriveSpark

Article Published On: Tuesday, September 17, 2013, 16:57 [IST]
English summary
International Cars & Motors Limited (ICML), a company owned by the Sonalika Group, the makers of tractors and farm equipments, has launched its new ambulance, which it calls the ‘Extreme Ambulance' It is available for a competitive price ranging between INR 6,15 lakhs and INR 6,58 lakhs (ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+