గోవాలో డీజిల్ కన్నా పెట్రోల్ ఇంధనమే చవక

గోవాలో లీటరు డీజిల్ ధర రూ.52.70 లుగా ఉంటే, లీటరు పెట్రోల్ ధర రూ.52.10 లుగా ఉంది. అంటే పెట్రోల్ ధర కన్నా డీజిల్ ధర లీటరుకు 60 పైసలు అధికంగా ఉందన్నమాట. గడచిన సంవత్సరంలో గోవా ప్రభుత్వం పెట్రోల్ ధరపై 0.1 శాతం వ్యాట్‌ను రద్దు చేయటంతో లీటరు పెట్రోల్ ధరపై ఏకంగా రూ.11 తగ్గింది. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో డీజిల్ ధర తక్కువగాను, పెట్రోల్ ధర ఎక్కువగాను ఉంటే, గోవాలో మాత్రం రివర్సులో పెట్రోల్ దర తక్కువగా, డీజిల్ ధర ఎక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications








