మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్‌పై రూ.5 లక్షల డిస్కౌంట్
కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేసే ముందుకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత మోడళ్ల స్టాక్‌ను క్లియర్ చేసుకోవటం ఎంతో అవసరం. ఈ దిశలోనే జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈనెలలో ఓ సరికొత్త అప్‌డేటెడ్ ఈ-క్లాస్ లగ్జరీ కారును మార్కెట్లో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం మార్కెట్లో పాత మోడల్ ఈ-క్లాస్ స్టాక్ క్లియర్ చేసుకునేందుకు గాను ఈ మోడల్‌పై కంపెనీ డీలర్లు భారీ తగ్గింపును అందిస్తున్నారు.
కొన్ని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీలర్‌షిప్ కేంద్రాలలో ప్రస్తుత వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ మోడల్‌పై రూ.5 లక్షల వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. మంచి డీల్‌లో ఈ-క్లాస్ లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే సరైన అవకాశం. మెర్సిజెస్ బెంజ్ ఇండియాకు ఈ-క్లాస్ మార్కెట్లో మంచి సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. గడచిన త్రైమాసికంలో మొత్తం 800 యూనిట్ల ఈ-క్లాస్ కార్లు అమ్ముడుపోయాయి.
కొత్తగా మార్కెట్లోకి రానున్న ఈ-క్లాస్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు, కేవలం కొన్ని కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉండనున్నాయి. కాబట్టి పెర్ఫామెన్స్ విషయంలో ఈ రెండు కార్లకు పెద్ద తేడా ఉండదు. డిజైన్, ఫీచర్ల పరంగానే తేడా ఉంటుంది. కాబట్టి, లక్షలు పోసి 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కారును కొనుగోలు చేయటానికి బదులు, ప్రస్తుత ఈ-క్లాస్‌ను కొనుకొన్ని లక్షలు మిగిలించుకోవటం మేలు.

కాగా.. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈనెల 25న మార్కెట్లో విడుదల కానుంది. లుక్ పరంగా ఇది మెర్సిడెస్ బెంజ్ 2013 డెట్రాయిట్ మోటార్ షోలో ఆవిష్కరించిన ఈ-క్లాస్ మాదిరిగా ఉంటుంది. 2013 ఈ-క్లాస్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన కొత్త హడ్‌లైట్స్ వంటి బాహ్య మార్పులు ఉండనున్నాయి. అలాగే, రివైజ్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, మార్చబడిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్, ఎగ్జాస్ట్ టిప్స్ అలాగే ఇంటీరియర్స్‌లో మెరుగైన క్యాబిన్ స్పేస్, డ్యాష్‌బోర్డుపై డిజైన్ మార్పులు, స్టీరింగ్ వీల్ మరియు కంట్రోల్స్‌పై మార్పులు చేర్పులు ఉండనున్నాయి.


Click it and Unblock the Notifications








