చెన్నై మార్కెట్లో జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్ కారు విడుదల
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ జాగ్వార్ గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ అధునాతన టూ సీటర్ స్పోర్ట్స్ కారు 'జాగ్వార్ ఎఫ్-టైప్' ఇప్పుడు చెన్నై మార్కెట్లో కూడా లభ్యం కానుంది. చెన్నైలో జాగ్వార్ ఎఫ్-టైప్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ వేరియంట్ (ఎఫ్-టైప్ ఎస్) ధర రూ.1.4 కోట్లుగా ఉండగా, టాప్-ఎండ్ వేరింట్ ధర (ఎఫ్-టైప్ వి8ఎస్) రూ.1.6 కోట్లుగా ఉంది (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై).
జాగ్వార్ ఎఫ్-టైప్ ఎస్ వేరియంట్లో 3.0 లీటర్ వీ6 సూపర్‌చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 380 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 4.9 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 275 కిలోమీటర్లు.
జాగ్వార్ ఎఫ్-టైప్ వి8ఎస్ వేరియంట్లో 5.0 లీటర్ సూపర్‌చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 495 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ కేవలం 4.3 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 300 కిలోమీటర్లు.



Click it and Unblock the Notifications








