జమ్మూ అండ్ కాశ్మీర్‌లో టాక్సీగా మారనున్న టాటా నానో
ఆ మధ్య ఎప్పుడో శ్రీలంకలో టాక్సీ అవతారమెత్తి ఆటో డ్రైవర్ల నిరసనకు కారణమైన టాటా నానో ఇప్పుడు మన దేశంలో కూడా టాక్సీ అవతారమెత్తింది. ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా పేరు తెచ్చుకున్న టాటా నానో కారు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మినీ టాక్సీగా సంచరించనుంది. టాటా నానో కారును క్యాబ్‌గా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని, ఆటో రిక్షాలు, ఇతర వాణిజ్య వాహనాలకు విధిస్తున్న ఛార్జీల పద్ధతిని ఈ నానో క్యాబ్‌కు వర్తింప చేయాలని ఆ రాష్ట్ర రవాణా శాఖకు అనేక అభ్యర్థనలు వస్తున్నాయి.
ఈ విషయంపై జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ మెహ్రాజ్ కాక్రూ వ్యాఖ్యానిస్తూ.. ఆటో రిక్షాలకు వర్తించే టారిఫ్ ప్రకారం, ప్రయాణికులను తరలించే వాణిజ్య వాహనంగా నానో క్యాబ్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతులను కోరుతూ అనేకమంది ప్రైవేట్ వ్యక్తుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. ఒకవేళ ఇందుకు రాష్ట్ర రవాణా విభాగం అనుమతులు ఇచ్చినట్లయితే, జమ్మూ అండ్ కాశ్మీర్ డెవలప్‌మెంట్ అథారిటీల ఆధ్వర్యంలో నానో క్యాబ్ పరుగులు పెట్టనుంది.
ఇక టాటా నానో విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చే, లీటరు పెట్రోలుకు 25.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. దీని మెరుగైన మైలేజే టాటా నానో కారును క్యాబ్‌గా ఉపయోగించుకునేలా వ్యాపారులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, సాంప్రదాయ ఆటో రిక్షాలతో పోల్చుకుంటే ఇది మరింత అధనపు భద్రతను ఆఫర్ చేస్తూ, ఇటు డ్రైవర్‌కు అటు ప్యాసింజర్లకు మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. మరోవైపు టాటా నానో డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి సరికొత్త టాటా నానో కారును త్వరలోనే మార్కెట్లోకి తీసుకువస్తామని రతన్ టాటా ఓ సందర్భంలోవ్యాఖ్యానించారు.



Click it and Unblock the Notifications








