డీజిల్ ధర పెంపును ఖండించిన జయలలిత

By Ravi

Jayalalithaa
డీజిల్ ధరను లీటరుపై 90 పైసల చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసినదే. అయితే, ఇలా ధరలను పెంచడం అనుచితమంటూ తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే జయలలిత ఈ పెంపును ఖండించారు. పెంచిన డీజిల్ ధరను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ద్వారా పెంచబడిన డీజిల్ ధర పెంపు కారణంగా నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోతాయని, ధరల పెరుగుదలను నియంత్రించేందుకు బదులు అన్ని శాఖలలో పెరుగుతున్న అవినీతిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆమె అన్నారు. ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు డీజిల్‌పై సబ్సిడీ ఎత్తివేసిందని, డీజిల్ ధరను పెంచడం పేదలకు వ్యతిరేకమని ఆమె విమర్శించారు.

భారత ప్రభుత్వం గడచిన జనవరిలో డీజిల్ ధర నియంత్రణను చమురు మార్కెటింగ్ కంపెనీల చేతుల్లో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరుసగా నాలుగు సార్లు ధర పెరిగింది. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పెట్రోల్ ధరను రెండు సార్లు తగ్గించిన చమురు కంపెనీలు డీజిల్ ధరను మాత్రం ఎలా పెంచుతాయని జయలలిత ప్రశ్నించారు.

డీజిల్‌ను మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకు అమ్మడం ద్వారా చమురు కంపెనీలు నష్టపోవడం కొనసాగినంతవరకు ప్రతి నెలా లీటర్‌కు 45 నుంచి 50 పైసల మేరకు డీజిల్‌ ధరను పెంచుకోవచ్చని కేంద్రప్రభుత్వం గత జనవరి 2013లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చమురు కంపెనీలు ప్రతినెలా డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, May 11, 2013, 17:12 [IST]
English summary
Tamil Nadu Chief Minister J Jayalalithaa has condemned the diesel price hike by 90 paise. She demanded an immediate withdrawal of diesel price increase. Diesel prices were on Friday, hiked by Rs 1.02 per litre, the fourth increase in rates this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+