జీప్ క్రాసోవర్ పేరు 'జీప్‌స్టర్'; ఇండియాకు వచ్చే అవకాశం

By Ravi

ఫియట్‌కు చెందిన పాపులర్ ఎస్‌యూవీ బ్రాండ్ అభివృద్ధి చేస్తున్న ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ/క్రాసోవర్‌కు 'జీప్‌స్టర్' (Jeepster) అనే పేరును పెట్టనున్నారు. జీప్ బ్రాండ్‌కు జీప్‌స్టర్ అనే పేరు కొత్తదేమీ కాదు. గతంలో 1948లో ఓపెన్ టాప్ విల్లీస్ మోడల్‌కు ఈ పేరును ఉపయోగించారు. ఆ తర్వాత 195, 1966, 1999 మోడళ్లకు కూడా ఈ పేరును ఉపయోగించటం జరిగింది.

జీప్ నుంచి రానున్న ఈ కొత్త జీప్‌స్టర్ కేవలం పురాతన పేరునే కాకుండా, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోని జీప్‌ల నుంచి స్ఫూర్తి పొంది క్లాసిక్ డిజైన్‌తో దీనిని తయారు చేయనున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, కొత్త జీప్‌స్టర్‌ను ఫియట్ 500ఎక్స్ క్రాసోవర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కొత్త కాంపాక్ట్ జీప్ మాదిరిగా కనిపించనుంది.


జీప్ నుంచి రానున్న ఈ ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రంట్ వీల్ డ్రైవ్, రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అంటే, దీనిని ఇటు సిటీ డ్రైవ్‌కు అటు ఆఫ్-రోడింగ్‌కు అనువుగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఉపయోగించనున్న ఇంజన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు కానీ, ఫియట్ 500 మరియు ఫియట్ 500ఎల్ మోడళ్లలో ఉపయోగించన ఇంజన్లను ఇందులో వాడే అవకాశం ఉంది.

ఈ రెండు మోడళ్లలో (ఫియట్ 500, 500ఎల్) వివిధ పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. అందులో 1.4 లీటర్ మల్టీఎయిర్, 1.6 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్లు పాపులర్ అయినవి. వచ్చే ఏడాది మార్చ్ నెలలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలిసారిగా ఆవిష్కరించనున్నారు.

Jeepster

జీప్ వచ్చే ఏడాది భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. ప్రారంభంలో భాగంగా రెండు జీప్ మోడళ్లు ఇండియాకు రానున్నాయి. అయితే, మన దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో, జీప్ ఈ కొత్త జీప్‌స్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా 2015 నాటికి భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, December 19, 2013, 10:02 [IST]
English summary
Jeep's upcoming compact SUV that's been due for some time now will be named Jeepster, according to a dealer who has seen the production version of the vehicle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+