వోల్వో ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా జీవ్ మిల్కా సింగ్

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేయటంలో ప్రసిద్ధి చెందిన, స్వీడన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో భారత మార్కెట్లో తమ కార్ల అమ్మకాలు పెంచుకేనేందకు సన్నాహాలు మొదలెట్టింది. ఈ సంవత్సరంలో 50 శాతం వరకు అమ్మకాల పెంచుకోవాలని లక్ష్యంగా విధించుకున్నామని వోల్వో ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న మోడళ్లకు అదనంగా వి40 క్రాస్‌ కంట్రీ మోడల్‌ను కూడా వచ్చ్ జూన్‌ నెల నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

భారత మార్కెట్లో తమ బ్రాండ్‌కు ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు 'జీవ్‌ మిల్కా సింగ్‌'ను ప్రచారకర్త (బ్రాండ్‌ అంబాసిడర్‌)గా నియమించుకున్నామని వోల్వో ఇండియా తెలిపింది. గడచిన సంవత్సరంలో మొత్తం 800 వాహనాలను విక్రయించామని, కాగా ఈ సంవత్సరంలో మొత్తం 1200 వాహనాలు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వోల్వో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ టోమస్‌ ఎంబర్గ్‌ తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చ్ 2013)లో వోల్వో ఇండియా ఇప్పటికే 276 వాహనాలను విక్రయించింది. గడచిన సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే ఇది 140 శాతం అధికం.

ప్రస్తుతం వోల్వో ఇండియా, పూర్తిగా విదేశాల్లో తయారైన వాహనాలను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత మార్కెట్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. జూన్‌లో కంపెనీ విడుదల చేయనున్న వోల్వో వి40 క్రాస్‌ కంట్రీ కారుఈ సెగ్మెంట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ప్రస్తుతం వోల్వో ఇండియా దేశీయ విపణిలో మొత్తం నాలుగు మోడళ్లను (ఎస్60, ఎస్80, ఎక్స్‌‌సి60, ఎక్స్‌‌సి90) మోడళ్లను విక్రయిస్తోంది.

Jeev Milkha Singh Becomes Volvo India Brand Ambassador

More from DriveSpark

Article Published On: Wednesday, April 10, 2013, 20:26 [IST]
English summary
As a boost to the company's association with golf, Volvo Cars India has appointed Indian golfer, Jeev Milkha Singh, as its brand ambassador.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+