సెప్టెంబర్ 4న రెండు కొత్త కవాసకి బైక్‌ల విడుదల
ఆగస్ట్ నెలలో సరికొత్త కార్లు సందడి చేసినట్లుగానే, సెప్టెంబర్ నెలలో కూడా మరికొన్ని కొత్త కార్లు, కొత్త మోటార్‌సైకిళ్లు విడుదల కానున్నాయి. జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి (Kawasaki) వచ్చే నెలలో రెండు సరికొత్త మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. స్పోర్ట్స్ బైక్ ప్రియులను టార్గెట్ చేసుకొని కవాసకి తమ సరికొత్త జెడ్ఎక్స్10ఆర్, జెడ్ఎక్స్14ఆర్ బైక్‌లను దేశీయ విపణిలో ప్రవేశపెట్టనుంది.
సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి అవుతున్న ఈ రెండు బైక్‌లు సెప్టెంబర్ 4, 2013వ తేదీన (హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ విడుదలైన తర్వాత రోజునే) దేశీయ విపణిలో విడుదల కానున్నాయి. బజాజ్-కవాసకి భాగస్వామ్యంలో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌లలో జెడ్ఎక్స్10ఆర్, జెడ్ఎక్స్14ఆర్ స్పోర్ట్స్ బైక్‌లు లభ్యం కానున్నాయి.

దేశీయ విపణిలో కవాసకి జెడ్ఎక్స్10ఆర్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.17-18 లక్షల రేంజ్‌లోను, కవాసకి జెడ్ఎక్స్14ఆర్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.20 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
కవాసకి జెడ్ఎక్స్10ఆర్ బైక్‌లో శక్తివంతమైన 998సీసీ, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు.

కవాసకి జెడ్ఎక్స్14ఆర్ బైక్‌లో మరింత శక్తివంతమైన 1441సీసీ, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 210 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








