మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్పు

మారుతి సుజుకి ఇండియా మాతృ సంస్థ అయిన జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఛైర్మన్ ఒసాము సుజుకి నేతృత్వంలో నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గడచిన ఆరు సంత్సరాలుగా మారుతి సుజుకి ఇండియా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన షింజో నకనిషి, 1982వ సంవత్సరం నుంచి మారుతిలో పనిచేస్తున్నారు.
మారుతి సుజుకిలో గడచిన 30 ఏళ్లుగా షింజో నకనిషి వివిధ హోదాలలో పనిచేశారు. జగదీష్ ఖత్తార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఈయన మారుతికి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2007లో జగదీష్ ఖత్తార్ నుంచి నకనిషి మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను పుచ్చుకున్నారు. కెనిచి అయికవా సుజుకి యూరోపియన్ కార్యకలాపాలు నిర్వహిస్తుండేవారు.
1955వ సంవత్సరంలో జన్మించిన అయుకవా జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ లా పూర్తి చేశారు. 1980లో ఈయన జపాన్‌లోని సుజుకి మోటార్ కార్పోరేషన్‌లో చేరారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఆ సంస్థలోని వివిధ విభాగాల్లో, విభిన్న హోదాలలో ఆయన పనిచేశారు.


Click it and Unblock the Notifications








