యాక్సిడెంట్‌లో ప్రాణాలొదిన రేసింగ్ దిగ్గజం కర్ట్ కరెల్లీ

మోటార్‌సైకిల్ రేసులు సరదాతో పాటుగా విషాదాన్ని కూడా ఇస్తాయి. అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ రేసింగ్ దిగ్గజం 'కర్ట్ కసెల్లీ' ఇటీవల జరిగిన 2013 ఎడిషన్ బాజా 1000 రేసులో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతిచిన్న వయస్సులోనే మోటార్‌సైకిల్ ఛాంపియన్‌షిప్‌లో అనేక విజయాలను సొంతం చేసుకొని, అద్భుతమైన బైక్ ఫీట్లు చేసిన కర్ట్, దురదృష్టవశాత్తు ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యాడు.

మెక్సికోలో జరిగిన ప్రపంచంలో కెల్లా అతి పొడవైన ఆఫ్-రోడ్ రేస్ అయిన బాజా 1000 ముగియటానికి మరికొద్ది దూరంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యంగ్ టాలెంట్‌కు, ఫ్యాన్స్‌కు రోల్ మోడల్ అయిన కర్ట్ కసెల్లీ ఏఎమ్ఏ, ఐఎస్‌డిఈ, డబ్ల్యూఓఆర్‍‌సిఎస్ చాంపియన్‌షిప్‌లలో తిరిగులేని విజయాలను సాధించాడు. కెటిఎమ్ మోటార్‌స్పోర్ట్స్ తరఫున కర్ట్ రేసుల్లో పాల్గొంటుంటాడు.

తన దారికి అడ్డుగా వస్తున్న జంతువును తప్పించడంలో కర్ట్ అదుపు తప్పి పడిపోయి ఉండొచ్చని రేస్ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కర్ట్ తలకు బలమైన గాయం కావటంతో, ఎన్‌సెనడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కర్ట్ అకాల మరణం రేసింగ్ అభిమానులను దుఖః సాగరంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో, కర్ట్ కరెల్లీకి నివాళి ఆయన జ్ఞాపకార్థం ఈ వీడియోను విడుదల చేశారు.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/N4QYlVnTNG4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Wednesday, December 11, 2013, 10:12 [IST]
English summary
The 2013 edition of Baja 1000 witnessed, the tragic loss of Kurt Caselli. This resolute and dauntless racer stamped his name in AMA, ISDE and WORCS Championship at an early age. Caselli was a popular figure in the KTM outfit, and a role model for young talent and fans.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+