లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్ కాన్సెప్ట్

By Ravi

సాధారణ కార్లను సాగదీసి పొడవుగా చేస్తే వాటిని 'లీమోజైన్' (Limousine) అని అంటారు. మన దేశంలో లీమోజైన్ కార్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే, విదేశాల్లో మాత్రం ఇవి ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తుంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, వాణిజ్య సమావేశాలు, విహారయాత్రలు మొదలైన వాటికి కోసం ఈ కార్లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి కార్లను కొనుగోలు చేయలేని వారు, తమ అవసరాల కోసం వాటిని అద్దెకు తీసుకుంటుంటారు.

హమ్మర్, క్యాడిలాక్, మెర్సిడెస్ బెంజ్ ఇలా అనేక కార్ కంపెనీలకు చెందిన కొన్ని ప్రముఖ మోడళ్లను లీమోజైన్‌లుగా మార్చి అద్దెకు ఇచ్చే, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లీమో రెంటల్ కంపెనీ 'కార్స్ ఫర్ స్టార్స్' ఇదివరకెన్నడూ చూడనివిధంగా ఓ లాంబోర్గినీ కారును లీమోజైన్‌గా మార్చాలను భావిస్తోంది. ఇటాలియన్ కార్ కంపెనీ అందిస్తున్న 'లాంబోర్గినీ అవెంటేడర్'ను ఆధారంగా చేసుకొని, ఇందులో ఓ లీమోజైన్‌ను తయారీ చేయాలని కంపెనీ నిర్ణయించింది.

ఇందులో భాగంగానే, లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌ను రూపొందించి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. విలావంతమైన ఇంటీరియర్స్, ప్రీమియం లెథర్ సీట్స్, వైన్ ర్యాక్స్, మినీ బార్, పొడవాటి సీట్లు, పెద్ద స్కీన్ ప్లాస్మా టివి వంటి అనేక ఫీచర్లతో ఈ లీమోజైన్‌ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. రెగ్యులర్ అవెంటేడర్ రెండు డోర్లను కలిగి ఉంటే, లీమోజైన్ వెర్షన్ అవెంటేడర్ నాలుగు డోర్లను కలిగి ఉండనుంది.

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్‌లో కూడా ఇంజన్‌ను వెనుక భాగంలో ఉంచనున్నారు. అయితే, ఈ కారును తయారు చేయటంలో ఓ పెద్ద సమస్య ఉంది. అదేంటంటే ఈ కారు బాడీ మొత్తాన్ని కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేశారు. కాబట్టి లీమోజైన్‌ను తయారు చేసేటప్పుడు బాడీ మొత్తాన్ని పూర్తిగా ప్రారంభం నుంచి తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పెంచాల్సి ఉంటుంది. మరి ఈ లీమోజైన్‌ను తయారు చేయటంలో కార్స్ ఫర్ స్టార్స్ సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

లాంబోర్గినీ అవెంటేడర్ లీమోజైన్

More from DriveSpark

Article Published On: Thursday, March 14, 2013, 14:17 [IST]
English summary
Cars for Stars is a U.K based luxury car hire service, which has conceptualized the Aventador Limo. This trademark Lambo Orange limo still features the Aventador scissor doors, but two sets instead of one.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+