భారత్‌లో సంపన్న యువతపై కన్నేసిన లాంబోర్గినీ

By Ravi

ఇటాలియన్ సూపర్ లగ్జరీ కార్ కంపెనీ లాంబోర్గినీ, భారతదేశంలో సంపన్న కుటుంబాలకు చెందిన యువతను ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తుంది. రానున్న రోజుల్లో భారత్‌లోని హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ నుంచి పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ఆర్జించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ దిశలో భాగంగా, లాంబోర్గినీ తమ నెట్‌వర్క్‌ను దేశంలోని పలు ప్రధాన నగరాల్లో, ప్రత్యేకించి ధనికులు ఎక్కువగా ఉండే నగరాల్లో కొత్త షోరూమ్‌లను ప్రారంభించనుంది.

ఇటీవలే తమ రెండవ షోరూమ్‌ను ప్రారంభించిన లాంబోర్గినీ, ఇప్పుడు దేశ ఐటి రాజధాని బెంగుళూరుపై కన్నేసింది. బెంగుళూరులో కూడా ఓ కొత్త షోరూమ్‌ను ప్రారంభించేందుకు బలమైన స్థానిక భాగస్వామి కోసం లాంబోర్గినీ అన్వేషిస్తోంది. ఇది లాంబోర్గినీ భారత్‌లో నాల్గవ షోరూమ్ కానుంది. లాంబోర్గినీ ఇండియాకు ఇప్పటికే, ముంబైలో ఒక షోరూమ్, ఢిల్లీలో రెండు షోరూమ్‌లు ఉన్నాయి.
మరిన్ని లాంబోర్గినీ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి


దేశంలో ఇలాంటి సూపర్ కార్లను ఎక్కువగా మొదటి తరానికి చెందిన వ్యాపారవేత్తలు కొనుగోలు చేస్తున్నారని, 30 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన రెండవ తరానికి చెందిన వ్యాపార కుటుంబాలు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయని ఆటోమొబిలి లంబార్గినీ స్పా ప్రెసిడెంట్, సీఈఓ స్టీఫెన్ వింకెల్‌మ్యాన్ అన్నారు. యూరప్‌లో కాన్నా కూడా భారత్‌లోని యువకులే ఎక్కువగా లాంబోర్గినీ కార్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు.

రానున్న సంవత్సరాల్లో భారత మార్కెట్లో కనీసం 30-40 కార్లను విక్రయిస్తామని, ఈ ఏడాదిలోనే 20కి పైగా కార్లను విక్రయించాలన్న లక్ష్యంతో ఉన్నామని వింకెల్‌మ్యాన్ చెప్పారు. గడచిన సంవత్సరంలో లాంబోర్గినీ భారత మార్కెట్లో 17 కార్లను విక్రయించింది. ప్రస్తుతం లాంబోర్గినీ దేశీయ విపణిలో లాంబోర్గినీ గల్లార్డో, లాంబోర్గినీ అవంటేడర్ అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తుంది. భారత్‌లో ఈ కార్ల ధరల శ్రేణి రూ.2.8 కోట్ల నుంచి రూ.6.30 కోట్ల వరకు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 25, 2013, 11:57 [IST]
English summary
It's not just the mainstream car manufacturers that are looking to expand their business in India. Italian supercar maker Lamborghini, which recently opened its second showroom in the country is reportedly looking to tap into the pool of the rich and young to sell more Aventadors and Gallardos in India. In this regard the company plans on opening a third showroom in the southern city of Bangalore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+