భారత్‌లో లాంబోర్గినీ గల్లార్డో లిమిటెడ్ ఎడిషన్ విడుదల

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ, తమ సంస్థను 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత వినియోగదారుల కోసం ఓ లిమిటెడ్ ఎడిషన్ గల్లార్డో కారును మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ లాంబోర్గినీ గల్లార్డో ఎల్‌పి550-2 లిమిటెడ్ ఎడిషన్ కారు ధర రూ.3.06 కోట్లు (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంది.

భారత మార్కెట్లో ఆలాంటి కార్లు కేవలం 6 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, వీటిలో ఇప్పటికే ఒక కారు అమ్ముడుపోయిందని కంపెనీ పేర్కొంది. అంటే, ఇక 5 లిమిటెడ్ ఎడిషన్ గల్లార్డో కార్లు మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. ఈ లిమిటెడ్ ఎడిషన్ లాంబోర్గినీ గల్లార్డో సూపర్ కారులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

కొద్దిపాటి గ్రాఫిక్స్ మార్పులతో కంపెనీ ఈ కారును విడుదల చేసింది. భారత మార్కెట్లో ఇది ఆరెంజ్, వైట్, గ్రీన కలర్ ఆప్షన్లతో ఇది అందుబాటులో ఉంది. ఈ కారులో ముందు వైపు బానెట్‌ నుంచి వెనుక వైపు ఇంజన్ వరకు మధ్యలో భారతీయతను ప్రతిభింభించేలా మువ్వన్నెల రంగుతో కూడిన ఫ్లాగ్‌ డిజైన్ పెయింట్ చేయబడి ఉంటుంది.

ఇంకా ఇందులో, డ్రైవర్ సీట్ క్వార్టర్ గ్లాస్ అలాగే ప్రత్యే కార్డెలియా రిమ్స్‌పై ఇండియా సిరీ స్పెషల్ ప్లేట్ దర్శనమిస్తుంది. బ్లాక్ ఇంటీరియర్స్, ఆరెంజ్ కలర్ స్టిచింగ్‌తో కూడిన డ్రైవ్, గ్రీన్ కలర్ స్టిచింగ్‌తో కూడిన ప్యాసింజర్ సీట్ మరియు వైట్ కలర్ స్టిచింగ్‌తో కూడిన సెంటర్ కన్సోల్ మరోసారి మన మూడు రంగుల జాతీయ పతాక థీమ్‌ను ప్రతిభింభింపజేస్తుంది.

Lamborghini Gallardo Limited Edition

Article Published On: Wednesday, June 19, 2013, 16:20 [IST]
English summary
As part of its 50th anniversary celebration Lamborghini has gifted its Indian fans with a limited edition India special Gallardo LP 550-2. As expected, the India special Lambo comes with the Indian tricolour graphics running across its length.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+