వచ్చే ఏడాదిలో లాంబోర్గినీ గల్లార్డో రీప్లేస్‌మెంట్

By Ravi

ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ అందిస్తున్న గల్లార్డో ఇక మాయం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గల్లార్డో స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ఓ సరికొత్త సూపర్ కారును ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఈ అధునాత సూపర్ కారును లాంబోర్గినీ ఆవిష్కరించనుంది. లాంబోర్గీనీ ఇటీవల ఆవిష్కరించిన ఈగోయిస్టా, సెస్టో ఎలిమెంటో కాన్సెప్ట్ మోడళ్ల డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది లాంబోర్గినీ గల్లార్డో రీప్లేమెంట్ మోడల్‌ను డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎల్‌పి724 అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ కారులో, ఇదివరకటి గల్లార్డోలో ఉపయోగించిన లైట్‌వెయిట్ కార్బన్ ఫైబర్ బాడీ, అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ స్ట్రక్చర్ వంటి కీలక పదార్థాలు మాత్రం యధావిధిగా ఉంటాయి. పాత వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త కారు పొడవును స్వల్పంగా 16 మి.మీ. పెంచి 4500 మి.మీ. చేర్చారు. అలాగే దీని వెడల్పును 1900 మి.మీ. ఎత్తును 1655 మి.మీ. ఉండేలా చేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్థం నాటికి ఇది మార్కెట్లో లభ్యం కానుంది.

అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఈ కారులో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుత వేరియంట్లో ఉపయోగించిన 5.2 లీటర్ వి10 ఇంజన్ గరిష్టంగా 552 పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.7 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. అయితే, కొత్త కారులో ఉపయోగించనున్న ఇంజన్ సామర్థ్యాన్ని మరింత పెంచే ఆస్కారం (600 హార్స్ పవర్) ఉంది.

2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
2013 లాంబోర్గినీ గల్లార్డో
గల్లార్డో రీప్లేస్‌మెంట్
గల్లార్డో రీప్లేస్‌మెంట్
గల్లార్డో రీప్లేస్‌మెంట్

More from DriveSpark

Article Published On: Tuesday, June 18, 2013, 12:01 [IST]
English summary
Considering the Gallardo first hit the streets almost a decade back it makes sense that Lamborghini has at hand a brand new replacement vehicle to take the aging Lambo's place. Rumors doing the round about an alleged replacement model have only gone up in recent months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+