నేడు జెడ్4 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నేడు (నవంబర్ 14, 2013)న తమ అప్‌గ్రేడెడ్ కన్వర్టిబల్ కారు 'జెడ్4' (Z4) భారత మార్కెట్లో విడుదల చేయనుంది. డ్రైవ్‌స్పార్క్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేస్తోంది. ఇప్పటి మా బృందం న్యూఢిల్లీ చేరుకుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌ను మా పాఠకులకు లైవ్‌లో అందించడం జరుగుతుంది.
బిఎమ్‌డబ్ల్యూ తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2014 జెడ్4 స్పోర్ట్స్ కారును ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2013 డెట్రాయిట్ మోటార్ షోలో బిఎమ్‌డబ్ల్యూ తొలిసారిగా ఆవిష్కరించింది. మునుపటి బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 స్పోర్ట్స్ కారుతో పోల్చుకుంటే, కొత్త 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొద్దిపాటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొత్త జెడ్4 సరికొత్త రంగులలో లభ్యం కానుంది. ఈ కారులో బాహ్య మార్పుల విషయానికి వస్తే, కొత్త ఫ్రంట్ బంపర్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ మరియు సైడ్ ఇండికేటర్స్‌ను కొత్తగా రీడిజైన్ చేశారు.

ఇంటీరియర్స్‌లో కూడా మార్పులు చేర్పలు ఉన్నాయి. గ్లాసీ బ్లాక్ ఫినిష్‌తో కూడిన ఎయిర్ వెంట్స్, 'ఫైన్‌లైన్ ఆంథ్రాసిట్' ఉడ్ ఫినష్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ వంటి మార్పులతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్స్‌ను కూడా మెరుగుపరచారు. ఇందులో ప్రధానమైన మార్పుగా కన్వర్టబిల్ రూఫ్‌ను చెప్పుకోవచ్చు. ఇది పూర్తి బ్లాక్ కలర్‌లో ఉంటుంది.
ఇండియన్ వెర్షన్ 2014 బిఎమ్‌డబ్ల్యూ జెడ్4 స్పోర్ట్స్ కారు విషయానికి వస్తే, జెడ్4 ఎస్‌డ్రైవ్ 35ఐ వేరియంట్ 3.0 లీటర్, ట్విన్ టర్బో, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. ఈ ఇంజన్ గరిష్టంగ 306 పిఎస్‌ల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








