లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఓమ్నీ విడుదల

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) అందిస్తున్న బహుళ ప్రయోజన వాహనం ఓమ్నీ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో లభ్యం కానుంది. మారుతి ఓమ్నీకు అదనపు ఫీచర్లను జోడించి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. వివిధ వాణిజ్యా, ప్యాసింజర్ అవసరాల నిమిత్తం లభ్యమవుతున్న మారుతి ఓమ్నీ ధరలు రూ.2.40 లక్షల నుంచి రూ.3.03 లక్షల (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) రేంజ్‌లో ఉన్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి ఓమ్నీలో ఐదు ఆకర్షనీయమైన ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అవి:

1. ఆక్సలరీ పోర్ట్‌తో (ఆక్స్-ఇన్ సపోర్ట్) కూడిన సిడి ప్లేయర్
2. నాలుగు స్పీకర్లు
3. ఫ్లోర్ మ్యాట్స్
4. లెఫ్ట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్
5. సరికొత్త సీట్ కవర్స్

కిడ్నాప్ వ్యాన్, క్రైమ్ వ్యాన్ అంటూ మారుతి ఓమ్నీపై పలు విమర్శలు రావటంతో, కంపెనీ తమ సరికొత్త ఈకో వాహనాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓమ్నీ కన్నా ఈకో అమ్మకాలే జోరుగా సాగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మారుతి సుజుకి తమ ఓమ్నీ వాహనాన్ని విక్రయించడం అవసరం అంటారా? ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి ఓమ్నీ విడుదలతో ఈ మోడల్ అమ్మకారు జోరందుకుంటాయో లేదో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

Limited Edition Maruti Suzuki Omni Launched

More from DriveSpark

Article Published On: Thursday, January 24, 2013, 6:37 [IST]
English summary
Country's largest carmaker Maruti Suzuki India has a introduced a limited edition variant of its multi purpose vehicle Omni. The Limited Edition Maruti Suzuki Omni gets five additional features including CD Player with Aux, 4 Speakers, Floor Mats, Left side rear view mirror, New seat covers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+