2013 ఈ21 ఫార్ములా వన్ కారును ఆవిష్కరించిన లోటస్
కొత్త సంవత్సరంలో ఫార్ములా వన్ రేస్ టైటిల్స్‌ను ఎగరేసుకుపోయేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్ములా వన్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఫార్ములా జట్లు 2013 సంవత్సరానికి గాను తమ సరికొత్త ఫార్ములా వన్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆరంభంలో ఫార్ములా వన్ టీమ్‌లు తమ ఎఫ్1 కార్లను ప్రదర్శించడం ఆనవాయితీ.
క్రితం సంవత్సరంలో తమ ఎఫ్1 కార్లలో తలెత్తిన సమస్యలు మరోసారి తలెత్తకుండా ఉండేలా, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని, రేస్‌కు అనువైన ఏరో డైనమిక్స్‌తో ప్రతి సంవత్సరం తమ కార్లను ఫార్ములా వన్ టీమ్‌లు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ దేశాలకు చెందిన ఫార్ములా వన్ టీమ్‌లు ఆయా దేశాల్లోనే తమ 2013 ఎఫ్1 కార్లను ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే తాజాగా లోటస్ ఫార్ములా వన్ టీమ్ తమ సరికొత్త 'ఈ21 ఫార్ములా 1' కారును ఆవిష్కరించింది.
గడచిన సంవత్సరంలో అబుదాబిలో జరిగిన ఫార్ములా వన్ రేసులో విజయం సాధించిన లోటస్ టీమ్, ఈ సంవత్సరంలో కూడా అగ్ర స్థానాన్ని చేజిక్కుంచుకోవాలని యోచిస్తోంది. లోటస్ ఆవిష్కరించిన ఈ21 ఫార్ములా వన్ కారు చూడటానికి గడచిన సంవత్సరంలో ఉపయోగించిన కారు మాదిరిగానే ఉంటుంది. అయితే, ఇందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి స్వల్పంగా రీడిజైన్ చేయటం జరిగింది. రివైజ్డ్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్స్, రివైజ్డ్ ఏరోడైనమిక్స్, సరికొత్త స్టీరింగ్ కన్సోల్ వంటి ఫీచర్లను ఈ21 ఫార్ములా 1 కారులో గమనించవచ్చు. మెరుపు వేగంతో పరుగులు తీయనున్న 2013 ఈ21 ఫార్ములా 1 కారును క్రింది ఫోటో ఫీచర్‌లో చూడండి.

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు

లోటస్ ఈ21 ఫార్ములా వన్ కారు



Click it and Unblock the Notifications








