స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో సగం ధరకే కొత్త లగ్జరీ కార్లు!

By Ravi

లగ్జరీ కార్లంటే ఇష్టపడే వారికి శుభవార్త. రానున్న రోజుల్లో లగ్జరీ కార్ల ధరలు సగానికి సగం తగ్గనున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంకాలను భారీగా తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆక్కడి నుంచి ఇండియాకు వచ్చే కార్ల ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. యూరోపియన్ దేశాలతో భారతదేశం కుదుర్చుకున్న 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (ఫ్రీ టేడ్ అగ్రిమెంట్)కు భారత సర్కార్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంగా జపాన్, దక్షిణ కొరియా వంటి యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే కార్లపై దిగుమతి సుంకాన్ని 30 శాతం వరకూ తగ్గించనున్నారు. ప్రస్తుతం భారత్‌కు దిగుమతి అయ్యే కార్లపై 100 శాతం సుంకాలను విధిస్తున్నారు. కాగా, ఇందులో 60 శాతం దిగుమతి సుంకాలే ఉన్నాయి. అందువల్లనే భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతుంటాయి.

యూరోపియన్ యూనియన్ దేశాలతో కుదుర్చుకున్న ఈ ప్రతిపాది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా 60 శాతం దిగుమతి సుంకంలో 30 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో, ఈ లగ్జరీ కార్ల ధరలు కూడా సగానికి సగం తగ్గనున్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం రూ.40 లక్షల ఖరీదు చేసే లగ్జరీ కారు ఇకపై రూ.20 లక్షలకే లభ్యం కానుందన్నమాట. అయితే, ఐరోపాయేతర దేశాలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలతో భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వలన మన దేశంలో వారి వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని సదరు దేశాలు వాపోతున్నాయి.

Luxury Cars To Become Cheaper In India With FTA

More from DriveSpark

Article Published On: Friday, April 26, 2013, 14:28 [IST]
English summary
Good news for luxury cars buyers, by 2017 import duty on luxury cars imported from European countries, Japan and South Korea could be cut down by up to 30 per cent, if the proposed FTAs (Free Trade Agreements) with these nations approved.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+