భారత్‌లో కంట్రీమ్యాన్ అసెంబ్లింగ్‌ను ప్రారంభించిన మినీ

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ 'మినీ'లో కంపెనీ అందిస్తున్న 'మినీ కంట్రీమ్యాన్' కారును భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు చెన్నైకు సమీపంలో ఉన్న ప్లాంటులోనే ఈ కంట్రీమ్యాన్ కారు ఉత్పత్తిని కూడా ప్రారంభించామని, దీనివలన ఈ కారు తక్కువ ధరకే భారత మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. మినీ కార్లను యూరప్‌కు వెలుపల అసెంబ్లింగ్ చేయటం ప్రప్రథమం కావటం విశేషం.

అధిక ధర కలిగిన ప్రీమియం కార్లకు డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో, తక్కువ ఉత్పాదక వ్యయంతో ఈ కారును స్థానికంగా ఉత్పత్తి చేయటం ద్వారా సరసమైన ధరకే దీనిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. స్థానికంగా భారత్‌లో ఉత్పత్తి అవుతున్న మినీ కంట్రీమ్యాన్ కారును రెండు డీజిల్ వేరియంట్లలో (మినీ కూపర్ డి కంట్రీమ్యాన్, మినీ కూపర్ డి కంట్రీమ్యాన్ హై) కంపెనీ ఆఫర్ చేయనుంది. ఇదివరకు ఈ రెండు మోడళ్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉండేవి కావు.

Mini India

ఈ రెండు మోడళ్లనే కాకుండా, పెట్రోల్ వెర్షన్ మినీ వన్ కంట్రీమ్యాన్ వేరయంట్‌ను కూడా కంపెనీ ఇక్కడే ఉత్పత్తి చేయనుంది. కాగా.. మినీ కూపర్ కంట్రీమ్యాన్, మినీ కూపర్, మినీ కూపర్ ఎస్, మినీ కూపర్ కన్వర్టిబల్ మోడళ్లను మాత్రం యాధావిధిగా సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లోనే ఇండియాకు దిగుమతి చేసుకొని, ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నట్లు మినీ ఇండియా పేర్కొంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మినీ శ్రేణి కార్ల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మినీ కూపర్ - రూ.26.60 లక్షలు
  • మినీ కూపర్ ఎస్ - రూ.29.90 లక్షలు
  • మినీ కూపర్ కన్వర్టిబల్ - రూ.32.50 లక్షలు
  • మినీ వన్ కంట్రీమ్యాన్ - రూ.23.50 లక్షలు
  • మినీ కూపర్ డి కంట్రీమ్యాన్ - రూ.25.60 లక్షలు
  • మినీ కూపర్ డి కంట్రీమ్యాన్ హై - రూ.28.90 లక్షలు
  • మినీ కూపర్ ఎస్ కంట్రీమ్యాన్ - రూ.34.20 లక్షలు
  • మినీ కూపర్ ఎస్ కంట్రీమ్యాన్ హై - రూ.37.50 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)

More from DriveSpark

Article Published On: Saturday, April 20, 2013, 11:07 [IST]
English summary
Just a year after introducing the Mini brand in India BMW has announced the start of local production in its Chennai plant. The Mini Countryman will be produced locally, which till now has never been produced outside of Europe.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+