మహీంద్రా నుంచి మరింత శక్తివంతమైన క్వాంటో!
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో'లో పవర్‌ఫుల్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆఫ్-రోడింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని, క్వాంటోలో ఓ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) వెర్షన్‌ను మహీంద్రా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మహీంద్రా క్వాంటో ఎస్‌యూవీ కేవలం టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది.
త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ ఫోర్-వీల్ డ్రైవ్ మహీంద్రా క్వాంటోలో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ, ఇంజన్ పరంగా మాత్రం మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త వేరియంట్‌లో 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం లభిస్తున్న క్వాంటోలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం పూనే రోడ్లపై కంపెనీ తమ పవర్‌ఫుల్ క్వాంటోను టెస్టింగ్ చేస్తోంది. శక్తివంతమైన ఇంజన్ చేరికతో ఈ మోడల్ పెర్ఫామెన్స్ కూడా భారీగా పెరగనుంది.

ప్రస్తుతం విపణిలో లభిస్తున్న మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. క్వాంటో మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది.
మహీంద్రా క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








