రీకాల్: 25,000 మహీంద్రా ఎక్స్‌యూవీ500లు వెనక్కి
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) నుంచి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500'లో అమర్చిన కొన్ని లోపపూరిత విడిభాగాలను రీప్లేస్ చేసేందుకు కంపెనీ రీకాల్‌ను ప్రకటించిన సంగతి తెలిసినదే. 2011-12 మధ్య కాలంలో తయారు చేసిన ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలలో ఉపయోగించిన ఫ్లూయిడ్ హోస్, ఫ్రంట్ పవర్ విండో యూనిట్స్, లెఫ్ట్ వైపర్ బ్లేడ్ కవర్‌లలో సమస్యల కారణంగా కంపెనీ ఈ రీకాల్‌ను ప్రకటించింది.
దాదాపు 25,000 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలలో ఈ సమస్యను గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. ఈ సమస్య గురించి తమ వినియోగదారులకు ప్రత్యేకంగా సమాచారం అందిస్తామని, ఈ విడిభాగాలను ఉచితంగా రీప్లేస్ చేస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. గతంలో భారత మార్కెట్లో వాహనాల రీకాల్‌కు అంతగా ప్రాముఖ్యతనిచ్చే వారు కాదు. అయితే, ఇలాంటి సమస్యల వలన తమ పబ్లిసిటీ దెబ్బతిని, కార్ల అమ్మకాలు తగ్గుముఖ పడుతాయన్న భయంతో పాటుగా సియామ్ తాజా మార్గదర్శకాలకు లోబడి ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల్లో సమస్యలను గుర్తించి రీకాల్ చేయటం జరుగుతుంది.

దేశీయ విపణిలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో శక్తివంతమైన 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








