ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని అప్‌గ్రేడ్ చేసిన మహీంద్రా
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి లభ్యమవుతున్న సక్సెస్‌ఫుల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' ఇప్పుడు అప్‌గ్రేడ్ అయ్యింది. వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఈ మోడల్‌ను మరింత సౌకర్యవంతంగా ఉండేలా అప్‌గ్రేడ్ చేసింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో బ్రేక్‌ల పనితీరు సరిగ్గా లేదని, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా కస్టమర్ల అభిరుచికి అనుగణంగా లేదనే ఫీడ్‌బ్యాక్ రావటం జరిగింది. ఈ నేపథ్యంలో, మహీంద్రా అండ్ మహీంద్రా పై సమస్యలను సరిచేసి, మునుపటి వెర్షన్ కన్నా మరింత మెరుగ్గా ఉండేలా ఎక్స్‌యూవీ500ను అప్‌గ్రేడ్ చేసినట్లు సమాచారం.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అప్‌గ్రేడెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఇప్పటికే పూనేలోని ఛాకన్ ప్లాంటులో ఉత్పత్తి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్‌యూవీ500 ఇప్పుడు ఉత్తమ బ్రేక్ ప్యాడ్స్, రీక్యాలిబ్రేట్ చేసిన ఏబిఎస్, బ్రేక్ బూస్టర్ వంటి మార్పులతో లభిస్తుంది. ఈ కారులోని క్లచ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేశారు.
అలాగే, సౌకర్యవంతమైన రైడ్ కోసం సస్పెన్షన్ బుష్‌లను మెరుగైన వాటితో రీప్లేస్ చేశారు. అప్‌గ్రెడెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మొత్తం మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్) లభ్యమవుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500లో పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. మైలేజ్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








