మహీంద్రా సెంచురో హిట్; 70,000ల యూనిట్లకు పైగా బుకింగ్స్

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వానాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం, ఈ ఏడాది జులై నెలలో భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ 110సీసీ బడ్జెట్ మోటార్‌సైకిల్‌ 'మహీంద్రా సెంచురో' (Mahindra Centuro) దేశీయ విపణిలో అతికొద్ది కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించింది.

ఇది భారత మార్కెట్లో విడుదలైన నాలుగు నెలల సమయంలోనే 70,000 మందికి పైగా కస్టమర్లను తన ఖాతాలో వేసుకుంది. సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు, సరసమైన ధర, మెరుగైన మైలేజ్, పవర్‌ఫుల్ ఇంజన్ వంటి తదితర అంశాలతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Mahindra Centuro

ఈ సందర్భంగా, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మరియు టూవీలర్ సెక్టార్ ప్రెసిడెంట్ అనూప్ మాథుర్ మాట్లాడుతూ.. మహీంద్రా సెంచురో విడుదలతో అత్యంత పోటీతో కూడిన కమ్యూటర్ సెగ్మెంట్లో మహీంద్రా టూవీలర్స్ శరవేగంగా తమ మార్కెట్ వాటాను పెంచుకుంటుందని, ఇప్పుడు తమ దృష్టంతా సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించజేయటంపైనే కేంద్రీకరించామని అన్నారు.

మహీంద్రా సెంచురో జులై 1, 2013న విడుదలైంది. దేశీయ విపణిలో దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ బైక్‌పై కంపెనీ ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది. మహీంద్రా సెంచురో బైక్‌లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 పిఎస్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 31, 2013, 10:12 [IST]
English summary
Mahindra Two Wheelers has announced that it has received an overwhelming 70,000 plus bookings for its Mahindra Centuro motorcycle within just 4 months of the bike’s launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+