తగ్గుతున్న అమ్మకాలతో ఉత్పత్తిని తగ్గించిన మహీంద్రా
భారత ఆటోమొబైల్ మార్కెట్లో గడచిన కొద్ది నెలలుగా అమ్మకాలు స్తబ్ధుగా సాగుతుండటంతో, తయారీదారులు తలలు పట్టుకుంటున్నారు. డిమాండ్‌కు మించి ఉత్పత్తి స్థాయి చేరుకోవటంతో కంపెనీల స్టాక్ యార్డులన్నీ కార్లతో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకునేందుకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.
ఇప్పటికే దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకుని, మానేసర్ ప్లాంటులో 3వ షిఫ్టును నిలిపివేసి, 200 మంది కాంట్రాక్ట్ వర్కర్లను శెలవుపై పంపించి వేసిన సంగతి తెలిసినదే. తాజాగా, దేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇదే బాటలో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో నెలలో భాగంగా, ఈనెలలో కొద్ది రోజులు ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు కంపెనీ పేర్కంది.
వరుసగా గడచిన 8 నెలల నుంచి కార్ల అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 8 రోజుల వరకు మహీంద్రా తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపి వేసే ఆస్కారం ఉంది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్ కొత్త ఒత్తిడులను ఎదుర్కుంటున్న నేపథ్యంలో, కంపెనీ ఇలా ఉత్పత్తిని నిలిపివేయటం గమనార్హం.



Click it and Unblock the Notifications








