మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కార్ ధరల వెల్లడి

By Ravi

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా రేవా తాజాగా ఢిల్లీ మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ'ను దశల వారీగా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, వివిధ నగరాల్లో తమ ఎలక్ట్రిక్ కారు ధరలను కంపెనీ వెల్లడించింది.

ఈ కారుపై ఢిల్లీ సర్కారు ఇచ్చిన సబ్సిడీలతో ఇది అక్కడి మార్కెట్లో కేవలం రూ.5.96 లక్షల (బేస్ వేరియంట్) ఆన్-రోడ్ ధరకే లభ్యమవుతోంది. ఈ కారు ధరలో 15 శాతం తగ్గింపు, 12.5 శాతం వ్యాట్ రీఫండ్, ప్రస్తుత రోడ్ ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపులను ఢిల్లీ సర్కారు తమపై వేసుకొని దాదాపు రూ.1.8 లక్షల రాయితీని అందిస్తోంది. అందుకే ఇది అక్కడి మార్కెట్లో అంత తక్కువ ధరకు లభ్యమవుతోంది.

Mahindra e2o Electric Car

అయితే, ఇతర రాష్ట్రాల్లో సబ్సిడీలు ఢిల్లీ రేంజ్‌లో లేకపోవటంతో, వివిధ రాష్ట్రాల్లో ఈ కారు ధరలు రూ.6.50 లక్షల నుంచి రూ.7.73 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. మహీంద్రా ఈ2ఓ రెండు వేరియంట్లో (టి-జీరో, టి-2) లభ్యమవుతుంది. ఈ నెలాఖరు నాటికి ఇది దేశంలోని ఇతర ప్రాంతాల్లో లభ్యం కానుంది. వివిధ రాష్ట్రాల్లో మహీంద్రా ఈ2ఓ ధరలు ఇలా ఉన్నాయి.
నగరం మహీంద్రా ఈ2ఓ టి0 మహీంద్రా ఈ2ఓ టి2
న్యూఢిల్లీ (ఆన్-రోడ్) రూ.5.95 లక్షలు రూ.6.24 లక్షలు
పంజాబ్, హర్యానా (ఎక్స్-షోరూమ్) రూ.7.19 లక్షలు రూ.7.56 లక్షలు
ముంబై (ఎక్స్-షోరూమ్) రూ.6.71 లక్షలు రూ.7.05 లక్షలు
బెంగుళూరు (ఎక్స్-షోరూమ్) రూ.6.50 లక్షలు రూ.6.83 లక్షలు
హైదరాబాద్ (ఎక్స్-షోరూమ్) రూ.7.32 లక్షలు రూ.7.69 లక్షలు
కొచ్చి (ఎక్స్-షోరూమ్) రూ.6.71 లక్షలు రూ.7.05 లక్షలు
అహ్మదాబాద్ (ఎక్స్-షోరూమ్) రూ.7.35 లక్షలు రూ.7.73 లక్షలు

More from DriveSpark

Article Published On: Saturday, March 23, 2013, 9:44 [IST]
English summary
Electric cars manufacturer Mahindra Reva has revealed the prices of its recently launched four-seater electric car Mahindra e2o. The prices are ranging from INR 6.50 lakhs to INR 7.73 lakhs (ex-showroom). Price may vary from state to sate. Take look at the detailed price list.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+