నెల్లూరులో మహీద్రా ఫస్ట్ ఛాయిస్ వర్క్‌షాప్ ప్రారంభం
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మల్టీబ్రాండ్ కార్ సర్వీసింగ్ కంపెనీ 'మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సర్వీసెస్' (ఎమ్‌ఎఫ్‌సిఎస్) ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో తమ తొలి వర్క్‌షాప్‌ను ప్రారంభించింది. మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సర్వీసెస్ సీఈఓ వైవిఎస్ విజయ్ కుమార్ ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో నెల్లూరు కూడా ఒకటని, ఈ వృద్ధిలో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు.
మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సర్వీసెస్ నిపుణులైన టెక్నీషియన్లను, నాణ్యమైన విడిభాగాలను, స్టేట్-ఆఫ్-ఆర్ట్ పరికరాలను, ఉచిత పికప్ మరియు డ్రాప్ సౌకర్యాలతో ఏ బ్రాండ్ కారుకైనా ప్రపంచ స్థాయి కార్ సర్వీసింగ్ అనుభూతిని అందిస్తుంది. మహీంద్రా ఛాయిస్‌కు ఇప్పటికె బెంగుళూరు, నాసిక్, హైదరాబాద్, ముంబై, పూనే, సూరత్, వపి, చెన్నైలలో సర్వీసింగ్ కేంద్రాలున్నాయి.
మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సర్వీసెస్ విభాగాన్ని 2008లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ లక్ష కార్ల సర్వీసింగ్ చేశామని, ఇది తమ అంకిత భావానికి, వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని కంపెనీ ప్రెసిడెంట్ (గ్రూప్ హెచ్‌ఆర్, కార్పోరేట్ సర్వీసెస్, ఆఫ్టర్ మార్కెట్) రాజీవ్ దూబే ఓ ప్రకటనలో తెలిపారు. ఏ బ్రాండ్ కార్‌నైనా సమర్థవంతంగా సర్వీసింగ్ లేదా రిపేర్ చేసి ఇవ్వగలమని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సర్వీసెస్ సీఈవో వైవిఎస్ విజయ్ కుమార్ పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications








