జూన్ 5, 2013న మహీంద్రా ఫ్రీ పొల్యూషన్ చెకప్ క్యాంప్

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మహీంద్రా అధీకృత డీలర్‍షిప్ వర్క్‌షాపులలో ఈ ఫ్రీ పొల్యూషన్ చెకప్ క్యాంప్ అందుబాటులో ఉంటుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహీంద్రా ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ పియూసి క్యాంప్ ద్వారా మహీంద్రా వినియోగదారులకు తమ వాహనాలు విడుదల చేసే కర్భన ఉద్ఘారాలను పరిమిత స్థాయిలో ఉంచుకునేందుకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది.
అంతేకాకుండా, ఈ ఉచిత పొల్యూషన్ చెకప్ క్యాంప్‌కు విచ్చేసే మహీంద్రా ఓనర్లకు ఉచితంగా పియూసి (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్‌ను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ చెకప్‌ను ఆర్టీవో అమోదించిన పియూసి మెషీన్ల ద్వారా చేయటం జరుగుతుంది. మరి మీరు మీ స్కొడా కారును ఈ చెకప్‌కు తీసుకువెళ్తున్నారా..?


Click it and Unblock the Notifications








