అప్‌గ్రేడెడ్ థార్ ఎస్‌యూవీని విడుదల చేసిన మహీంద్రా
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న థార్ ఎస్‌యూవీ విషయంలో కస్టమర్ల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఈ అప్‌డేట్స్‌లో మొదటగా బాడీ రిగిడిటీని మెరుగుపరచేందుకు ఏ మరియు బి పిల్లర్స్‌కు మధ్యలో ఏర్పాటు చేసిన కొత్త క్రాస్ బార్. ఇదివరకటి పాత థార్‌లో బి పిల్లర్స్ ఫ్లెక్సిబల్‌గా ఉండి, గతుకుల రోడ్లపై వెళ్తున్నప్పుడు డోర్లను గట్టిగా గుద్దుకునేవి, ఈ లోపాన్ని సరిచేసేందుకే ఆ కొత్త క్రాస్ బార్‌ను జోడించారు.
మరొక ప్రధానమైన మార్పు, ముందు యాక్సిల్‌లోని ఆటో లాకింగ్ హబ్స్‌ను తొలగించడం. కొత్త థార్‌లో దీనికి బదులుగా మరింత విశ్వసనీయమైన, ఫ్లెక్సిబల్ ప్లాంజ్ సెటప్‌ను జోడించారు. (ఇప్పుడు ఫ్రంట్ డ్రైవ్‌షాఫ్ట్స్ ఎల్లప్పుడూ ఎంగేజ్ అయి ఉంటాయి).

ఇంటీరియర్లలో కూడా చిన్నపాటి మార్పులు ఉన్నాయి. బొలెరో విఎల్ఎక్స్ వేరియంట్ నుంచి గ్రహించిన ఎయిర్ కండిషనింగ్ స్విచ్‌లు, వెనుక వైపు హెడ్‌రూమ్‌ను పెంచేందుకు గాను వెనుక సీట్ల ఎత్తును సుమారు 6-7 మి.మీ. తగ్గించారు. అలాగే డ్రైవర్ సెక్షన్ వరకూ రూఫ్‌ను (పైభాగాన్ని) తొలగించుకునేందుకు సులువైన మార్గం, ధృఢమైన ఇన్నర్ డోర్ హ్యాండిల్స్ వంటి మార్పులు చేశారు.
ఇకపోతే ఇంజన్ పరంగా కొత్త థార్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 2.5 లీటర్ సిఆర్‌డిఈ టర్బో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 15 హార్స్ పవర్‌లల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
మంచి విషయం ఏంటంటే, ఈ మార్పులు/అప్‌డేట్లను కేవలం కొత్త థార్‌లోనే కాకుండా, ప్రస్తుత మహీంద్రా థార్‌లో కూడా చేసుకోవచ్చు. క్రాస్ బార్‌ను వెల్డింగ్ చేసుకోవటం, ఆటో లాక్ హబ్స్ స్థానంలో ఫ్లెక్సిబల్ ఫ్లాంగ్‌లతో రీప్లేస్ చేసుకోవటం. మరొక మంచి విషయం ఏంటంటే, అప్‌గ్రేడ్ చేయబడిన ఈ కొత్త మహీంద్రా థార్ ధరలో ఎలాంటి పెరుగుదల లేదు. ఇదివరకటి ధరకే కొత్త థార్ లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








