మహీంద్రా నుంచి చవక వేరియంట్ ఎక్స్‌యూవీ500!
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500'లో ఓ చవక వేరియంట్‌ను అలాగే మరొక ప్రీమియం వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ విషయంపై మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు (ఫామ్ ఎక్విప్‌మెంట్, ఆటోమోటివ్ సెక్టార్) పవన్ గోయెంకా మాట్లుడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టాప్-ఎడ్ వేరియంట్ ఎక్స్‌యూవీ500 కన్నా మరింత ఖరీదైన వేరియంట్‌ను అలాగే ఓ చవక వేరియంట్‌ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. ఈలోపుగా మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం దేశీయ విపణిలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. చవక వేరియంట్ ఎక్స్‌యూవీ500ను ఎంట్రీ-లెవల్ వేరియంట్‌కు (డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్) దిగువన విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లో లభిస్తున్న ఫీచర్లలో చాలా వరకు తగ్గించి, తక్కువ ధరకే దీనిని అందించవచ్చని అంచనా. అలాగే, మరింత ఖరీదైన ఎక్స్‌యూవీ500ను టాప్-ఎండ్ వేరియంట్ (డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్)కు ఎగువన మరిన్ని అదనపు ఫీచర్లతో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

అయితే, ఈ రెండు వేరియంట్లలో కూడా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం లభిస్తున్న ఎక్స్‌యూవీ500లో ఉపయోగించిన పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌నే ఈ కొత్త వేరియంట్లలోను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








