ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌కు పోటీగా మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరొక కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదల కానుంది. అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ నుంచి త్వరలో దేశీయ విపణిలో విడుదల కానున్న 'ఫోర్డ్ ఈకోస్పోర్ట్' ఎస్‌యూవీని సవాల్ చేస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా ఓ చిన్న ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం 'ఎస్101' అనే కోడ్‌నేమ్‌తో మహీంద్రా అండ్ మహీంద్రా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది.

కొత్తగా మార్కెట్లోకి రానున్న ఈ మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ తొలిఫొటోను ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్ ఆటోకార్ ఇండియా తమ ఏప్రిల్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీ చూడటానికి మహీంద్రా ఎక్స్‌యూవీ500కు చిన్న తమ్ముడి మాదిరిగా ఉంటుంది. ఎక్స్‌యూవీ500 మోడల్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని సమాచారం. మహీంద్రా క్వాంటోకు దిగువన ఈ మోడల్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మించారు. ఇది నాలుగు మీటర్ల తక్కువ పొడవును కలిగి ఉండి, తక్కువ ఎక్సైజ్ సుంకం పరిధిలోకి వస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 6-సీటింగ్ ఆప్షన్‌తో పాటుగా 8-సీటర్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో సెంటర్ కన్సోల్ ఉండదు (డ్రైవర్ ప్యాసింజర్ సీట్లకు మధ్యలో ఉండే భాగం).

New Mahindra Compact SUV

గేర్‌బాక్స్‌ను డ్యాష్ బోర్డుకు అమర్చారు. దీని వలన ఫ్రంట్ సీట్లలో డ్రైవర్‌తో పాటుగా ఇద్దరు ప్యాసింజర్లు కూర్చునే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్రంట్ సీట్లలో ముగ్గురు, వెనుక సీట్లలో ముగ్గురు మొత్తం ఆరుగులు ప్రయాణికులు ఇందులో హాయిగా ప్రయాణించవచ్చు. వెనుక ఉన్న బూట్ స్పేస్‌లో మడిచిపెట్టుకునేందుకు వీలుండేబేబీ సీట్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ఈ బుజ్జి ఎస్‌యూవీలో మొత్తం 8 మంది ప్రయాణించవచ్చు.

ఈ కాంపాక్ట్ ఎస్‌‌యూవీకు సంబంధించి అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీని ధర రూ.5 లక్షలకు దిగువనే ఉండొచ్చని అంచనా. ఇదే గనుక నిజమైతే, భారత మార్కెట్లో ఈ బుజ్జి ఎస్‌యూవీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవటం ఖాయం. అంతేకాకుండా, ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్ల అమ్మకాలు కూడా దెబ్బతినే ఆస్కారం ఉంది. సరికొత్త మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం ప్రకారం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Source: Autocar Magazine

More from DriveSpark

Article Published On: Saturday, March 30, 2013, 14:28 [IST]
English summary
SUV specialist Mahindra and Mahindra is now working on a new compact SUV to compete with models like Ford EcoSport, Renault Duster. Codenamed as S101, the new compact SUV is rumoured to be priced under Rs 5 lakh. Company will place this S101 under the recently launched Quanto.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+