హైదరాబాద్‌లో బొలెరో పికప్‌ను విడుదల చేసిన మహీంద్రా
హైదరాబాద్: ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తమ కొత్త బొలెరో పికప్‌ను రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. బొలెరో పికప్ ఫ్లాట్ బెడ్ పేరుతో కంపెనీ విడుదల చేసిన ఈ పికప్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. రాష్ట్ర విపణిలో వీటి ధరలు రూ.5.56 లక్షల నుంచి రూ.5.76 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).
ఈ కొత్త పికప్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని, ఇది 1,250 కిలోల లోడ్‌ను తీసుకెళ్ళగలదని, ఇంధన ఆదా కోసం ఇందులో మైక్రో హైబ్రిడ్ ఫ్యూయల్ టెక్నాలజీని ఉపయోగించామని కంపెనీ వివరించింది. ఇందులో 63 హెచ్‌పి శక్తిని, 195 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఇంజన్‌ను ఉపయోగించారు.
మహీంద్రా బొలెరో పికప్ ఫ్లాట్ బెడ్ లీటరుకు 13.68 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. బొలెరో పికప్ ఫ్లాట్‌బెడ్ మూడేళ్ళ అపరిమిత వారంటీతో లభిస్తుంది. ఆకర్షణీయమైన డ్యుయల్ టోన్ ఇంటీరియర్స్‌తో సౌకర్యవంతమైన సీటింగ్-హెడ్ రెస్ట్‌తో కూడిన ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి విశిష్టమై ఫీచర్లతో ఇది లభిస్తుందని కంపెనీ తెలిపింది.



Click it and Unblock the Notifications








