మహీంద్రా క్వాంటోపై రూ.44,000 వరకు డిస్కౌంట్స్

By Ravi

అత్యంత సరసమైన ధరకే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల కావటంతో ఈ సెగ్మెంట్లో పోటీ గణనీయంగా పెరిగింది. ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ఇతర కార్ కంపెనీలు కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే, దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో'పై భారీ తగ్గింపులను అందిస్తోంది.

మాన్‌సూన్ మానియా పేరుతో మహీంద్రా క్వాంటోపై రూ.44,000 ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ జులై 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ ఓ వాణిజ్య ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత మహీంద్రా డీలరును సంప్రదించండి.

Mahindra Offers Discounts Upto Rs 44000 On Quanto

ఇక మహీంద్రా క్వాంటో విషయానికి వస్తే, ఇందులో అమర్చిన శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది.

క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2013, 16:10 [IST]
English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra is offering a discount/benefits of upto Rs 44,000 on Quanto. This scheme is valid till 31st July 2013. Visit your nearest official Mahindra distributor for more details on this offer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+