మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్లాప్ అయినట్లేనా?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో' దేశీయ మార్కెట్లో ఆశించిన రీతిలో అమ్ముడుపోవటం లేదు. ఈ సెగ్మెంట్లో రెనో డస్టర్, త్వరలో రానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు సమాధానంగా ఎమ్ అండ్ ఎమ్ ప్రవేశపెట్టిన ఈ బుజ్జి ఎస్‌యూవీ భారత మార్కెట్లో అట్టర్ ఫ్లాప్ అయినట్లు తెలుస్తోంది.

ఎమ్ అండ్ ఎమ్ గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ మోడల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. మొదట్లో ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగినప్పటికీ, ఆ తర్వాత క్రమక్రంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే ఆటోమొబైల్ ప్రియులకు పాతచింతకాయ పచ్చడిని లేటెస్ట్ గార్నిష్ చేసి ఇచ్చినట్లుగా జైలో ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన క్వాంటోను ఆఫర్ చేయటంతో కొనుగోలుదారులు ఇందులో పెద్ద కొత్తేముందని ప్రశ్నిస్తున్నారు.

గడచిన నాలుగు నెలలుగా క్వాంటో అమ్మకాలను పరిశీలిస్తే, జనవరిలో 2,954 యూనిట్లు, ఫిబ్రవరిలో 2,099 యూనిట్లు, మార్చిలో 1,857 యూనిట్లు, ఏప్రిల్ నెలలో 1,338 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే క్వాంటో అమ్మకాలు ప్రతినెలా తగ్గుతూ వస్తున్నాయన్నమాట. మరి క్వాంటో కూడా మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి ఓ ఫ్లాప్ మోడల్‌గా మిగిలిపోతుందా..?

Mahindra Quanto

ఇక మహీంద్రా క్వాంటో విషయానికి వస్తే, ఇందులో అమర్చిన శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది.

క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 9, 2013, 9:42 [IST]
English summary
The Mahindra Quanto is the another flop story from Mahindra and Mahindra? Recent sales report says YES to this question. Mahindra sold 2954 units in January 2013, 2099 units in February 2013, 1857 units in March 2013 and only 1338 units in April 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+