మార్చి 18న వస్తున్న మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు

By Ravi

మహీంద్రా రేవా అభివృద్ధి చేసిన తొలి ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ' (Mahindra e2o) విడుదల తేది ఖరారైంది. తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇది వరకటి కథనంలో ప్రచురించినట్లుగానే, తమ ఈ2ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈనెల 18న మార్కెట్లో విడుదల చేస్తామని మహీంద్రా రేవా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ కారును మహీంద్రా తొలిసారిగా గడచిన సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

మార్చి 18, 2013న న్యూఢిల్లీలో ఈ కారును వాణిజ్య పరంగా మార్కెట్లో విడుదల చేస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమోటివ్, ఫామ్ ఎక్విప్‌మెంట్ సెక్టార్స్) డా. పవన్ గోయెంకా తెలిపారు. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్లాటినం సర్టిఫికెట్ పొందిన బెంగుళూరు ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంటులో ఏటా సుమారు 30,000 ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి కానున్నాయి.

ప్రకృతి ఏవిధంగాను హాని కలిగించని రీతిలో (ఈకో ఫ్రెండ్లీ) కారును మహీంద్రా రేవా తయారు చేసింది. మహీంద్రా ఈ2ఓ పేరులో ఈ అనే అక్షరం సూర్యుని శక్తిని, 2 (టూ) కారులో కనెక్ట్ చేయబడిన టెక్నాలజీని, ఓ అనే అక్షరం ఆక్సిజన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన నెక్స్ట్ జనరేషన్ లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఈ బ్యాటరీలను ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించవచ్చు.

Mahindra e2o

More from DriveSpark

Article Published On: Wednesday, March 6, 2013, 13:17 [IST]
English summary
Mahindra Reva has announced that it would launch its next generation electric vehicle, the e2o, on 18th March 2013 in New Delhi. The Mahindra e2o (powered by Reva) is the embodiment of the Mahindra Group’s vision of the Future of Mobility for a sustainable tomorrow. It was unveiled at the last Auto Expo in New Delhi during January 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+