సిఎం చేతుల మీదుగా మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల తయారీ ప్లాంటును బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి చేతు మీదుగా ప్రారంభించింది. ట్రాక్టర్ల తయారీలో ఆసియాలో కెల్లా అతి పెద్ద ప్లాంటు ఇదేనని కంపెనీ పేర్కొంది. రూ.300 కోట్ల పెట్టుబడితో ఏటా లక్ష ట్రాక్టర్ల తయారీ చేయగల సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేశామని కంపెనీ వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంటులో మహీంద్రా, స్వరాజ్ బ్రాండ్ ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనున్నారు. ప్రారంభంలో భాగంగా, ఈ ప్లాంటులో ప్రతి నెలా 1,000 ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తామని, ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని రానున్న నాలుగేళ్లలో పూర్తి స్థాయికి చేర్చుతామని మహీంద్రా అండ్ మహాంద్రా ఆటోమోటివ్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ విభాగాల ప్రెసిడెంట్ పవన్ గోయెంకా చెప్పారు. ప్రస్తుతం ట్రాక్టర్ల మార్కెట్ మందకొడిగా ఉన్నప్పటికీ, సమీప భవిష్యత్తులో ఇది పుంజుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రాక్టర్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రాకు దేశీయంగా 40-41 శాతం మార్కెట్ వాటాను, రాష్ట్రీయంగా 48 మార్కెట్ వాటాను కలిగి ఉందని ఆయన తెలిపారు. మెదక్‌లో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంటుతో రాష్ట్రంలో మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని గోయెంకా చెప్పారు. ఇదిలా ఉండగా, మహీంద్రా నుంచి రాష్ట్రానికి మరొక కొత్త ప్లాంటు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్యాసింజర్ మరియు ఫోర్-వీల్ లోడ్ క్యారియర్ వాహనాలను తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జహీరాబాద్‌లో ఉన్న ఆల్విన్ నిస్సాన్ ప్లాంటును పీకల్లోతు కష్టాల్లో కూరురుపోయిన ఐటి కంపెనీ సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసి మహీంద్రా గ్రూపు విజయం సాధించందని చెప్పారు. రాష్ట్రంలో ఖాయిలా పడ్డ పరిశ్రమలను, సంస్థలను కొనుగోలు చేయటానికి బదులు కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సిఎం కోరారు.

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
రిబ్బన్ కట్ చేసి జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ ప్లాంటును ప్రారంభిస్తున్న సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి. చిత్రంలో ఎమ్ అండ్ ఎమ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, గీతా కుమారిలను చూడొచ్చు.

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
జహీరాబాద్ ప్లాంటులో తయారైన మొదటి ట్రాక్టరుపై కిరణ్‌కుమార్ రెడ్డి, గీతా కుమారి, ఆనంద్ మహీంద్రా.

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
స్విఛ్ ఆన్ చేసి ప్లాంటును ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
ప్లాంటులో మొక్కలు నాటుతున్న సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
ప్లాంట్ పురోగతిని తిలకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి.

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
ఫోటోలకు ఫోజిలిస్తూ..

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
శిలాఫలకాన్ని ప్రారంభిస్తూ..

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
వీడియోను తిలకిస్తూ..

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
వేదికపైకి ప్రవేశిస్తూ..

మహీంద్రా జహీరాబాద్ ట్రాక్టర్ ప్లాంట్ ప్రారంభం
నాటిన మొక్కలకు నీరు పోస్తూ..


Click it and Unblock the Notifications








