టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన మహీంద్రా ఎస్101

By Ravi

ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ధీటుగా మన దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 'ఎస్101' (S101) అనే కోడ్‌నేమ్‌తో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ పలు కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రస్తుతం ఈ ఎస్‌యూవీని చెన్నై రోడ్లపై కంపెనీ టెస్టింగ్ చేస్తోంది.

దీన్ని బట్టి చూస్తుంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ఈ ఎస్‌యూవీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్ అండ్ ఎమ్ స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటో దిగ్గజం శాంగ్‌యాంగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీవి 'ఎస్101' అభివృద్ధి చేశారు. ఆరు సీట్లు కలిగి ఉండటం ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ప్రధాన ప్రత్యేకత.

Mahindra S101

ముందు వరుసలో మూడు సీట్లు, వెనుక వరుసలో మూడు సీట్లు ఉండేలా దీని ఇంటీరియర్ డిజైన్ ఉండనుంది. గేర్ బాక్స్‌ను డ్యాష్‌బోర్డులోనే అమర్చేలా (డాట్సన్ గో మాదిరిగా) దీని డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. మహీంద్రా క్వాంటో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, ఎక్స్‌యూవీ500 డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు.

మహీంద్రా ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మించారు. ఇది నాలుగు మీటర్ల తక్కువ పొడవును కలిగి ఉండి, తక్కువ ఎక్సైజ్ సుంకం పరిధిలోకి వస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 3-సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించవచ్చని సమాచారం. దేశీయ విపణిలో దీని ధర రూ.5 లక్షల ఉండొచ్చని అంచనా. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2013, 16:17 [IST]
English summary
Mahindra's new compact SUV S101 (code name) has been spotted testing in Chennai with heavy camouflage, revealing its tail lights. It has now emerged that the compact SUV from Mahindra will launch in early 2014 after the revelation at the Indian Auto Expo in February.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+