రెనో డస్టర్‌ను ఓవర్‌టేక్ చేసిన మహీంద్రా స్కార్పియో

By Ravi

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) విభాగంలో పోటీ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో హాట్ ఫేవరేట్‌గా ఉన్న ఫ్రెంచ్ మోడల్ రెనో డస్టర్‌ను మేడ్ ఇన్ ఇండియా మహీంద్రా స్కార్పియో గడచిన ఆగస్ట్ 2013 నెలలో ఓవర్‌టేక్ చేసింది.

గడచిన ఆగస్ట్ నెలలో రెనో ఇండియా మొత్తం 2,967 డస్టర్ ఎస్‌యూవీలను విక్రయిస్తే, మహీంద్రా అండ్ మహీంద్రా 3,356 స్కార్పియో ఎస్‌యూవీలను విక్రయించింది. అంతకు ముందు నెలలో (జులై 2013)లో రెనో డస్టర్ అమ్మకాలను మహీంద్రా స్కార్పియో అధిగమించింది. జులై 2013లో మొత్తం 3,089 డస్టర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోగా, 3,256 స్కార్పియో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.


అయితే, మొత్తమ్మీద ఏడాది జనవరి నుంచి జులై 2013 మధ్య కాలంలో అమ్మకాలను పరిశీలిస్తే, డస్టర్ అమ్మకాలే అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో మొత్తం 36,545 రెనో డస్టర్ ఎస్‌యూవీలు అమ్ముడుపోగా, 32,867 మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలు అమ్ముడుపోయాయి.

ఈ విషయంపై మహీంద్రా అండ్ మహీంద్రా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్) ప్రవీన్ షా మాట్లాడుతూ.. స్కార్పియో బ్రాండ్ ఇప్పటికీ పటిష్టంగా ముందుకు సాగుతోందని, పెరిగిన ఎక్సైజ్ సుంఖం, ప్రతికూల మార్కెట్ వాతావరణ పరిస్థితుల్లో వృద్ధిని కనబరుస్తోందని అనానారు. ఈ మోడల్‌కు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పోటీ ఉన్నప్పటికీ, స్కార్పియో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేస్తుందని ఆయన చెప్పారు.

Renault Duster

ఇదే అంశంపై రెనో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) స్పందిస్తూ, ఈ రెండు ఉత్పత్తులను (డస్టర్, స్కార్పియో) పోల్చడం సరికాదని, వీటివి విభిన్న సెగ్మెంట్ల కోసం మరియు విభిన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టబడ్డాయని, ఈ పోలిక యాపిల్, ఆరెంజ్ పండ్లను పోల్చినట్టుగా ఉందని అన్నారు. డస్టర్ అమ్మకాలు స్థిరంగానే సాగుతున్నాయని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 5, 2013, 14:42 [IST]
English summary
India's most popular SUV Mahindra Scorpio has outpaced to Renault Duster in terms of sales in August.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+