4 లక్షల సేల్స్ మార్క్‌ను క్రాస్ చేసిన మహీంద్రా స్కార్పియో
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ 'మహీంద్రా స్కార్పియో' మరొక సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది.ప్రస్తుతం భారతీయ రోడ్లపై నాలుగు లక్షలకు పైగా స్కార్పియోలు తిరుగుతున్నాయి.
బహుశా ఈ సందర్భాన్ని పురస్కరించుకునే 'మహీంద్రా స్కార్పియో'లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. టాప్ ఎండ్ వేరియంట్ స్కార్పియోకు ఎగువన లభించనున్న దీని ధర రెగ్యులర్ వెర్షన్ కన్నా సుమారు రూ.20,000-30,000 ఎక్కువగా ఉండొచ్చని అంచనా. గత 2010 సంవత్సరంలో మహీంద్రా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ స్కార్పియోకు, తాజాగా ప్రవేశపెట్టిన స్కార్పియోకు పెద్దగా మార్పులేమీ లేవు.

గత 2010లో విడుదలైన స్పెషల్ ఎడిషన్ స్కార్పియో ఉత్పత్తిని 1,000 యూనిట్లకు పరిమితం చేయగా, తాజాగా విడుదల చేసిన స్కార్పియో ఉత్పత్తిని కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. స్పెషల్ ఎడిషన్ స్కార్పియోలో స్పెషల్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్, క్రోమ్డ్ అల్లాయ్ వీల్స్, స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్, యూరోపియన్ లగ్జరీ లెథర్ ఇంటీరియర్స్, లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్, గ్లోజీ ఫినిష్‌తో కూడిన ఉడెన్ సెంటర్ కన్సోల్, డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్, రూఫ్ మౌంటెడ్ డివిడి ప్లేయర్, 9 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్ వంటి ప్రత్యేక ఫీచర్లు లభిస్తున్నాయి.
ఇంజన్ పరంగా స్పెషల్ ఎడిషన్ మహీంద్రా స్కార్పియోలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 120 పిఎస్‌ల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








