స్పెషల్ ఎడిషన్ స్కార్పియోను విడుదల చేసిన మహీంద్రా
యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విపణిలో అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మహీంద్రా స్కార్పియో'లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, టాప్ ఎండ్ వేరియంట్‌కు ఎగువన లభించనున్న దీని ధర రెగ్యులర్ వెర్షన్ కన్నా సుమారు రూ.20,000-30,000 ఎక్కువగా ఉండొచ్చని అంచనా.
గత 2010 సంవత్సరంలో మహీంద్రా విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ స్కార్పియోకు, తాజాగా ప్రవేశపెట్టిన స్కార్పియోకు పెద్దగా మార్పులేమీ లేవు. 2010లో విడుదలైన స్పెషల్ ఎడిషన్ స్కార్పియో ఉత్పత్తిని 1,000 యూనిట్లకు పరిమితం చేయగా, తాజాగా విడుదల చేసిన స్కార్పియో ఉత్పత్తిని కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. స్పెషల్ ఎడిషన్ స్కార్పియోలో లభ్యం కానున్న ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి:

- స్పెషల్ ఫీచర్లు
- స్పెషల్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్
- క్రోమ్డ్ అల్లాయ్ వీల్స్
- స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్
- యూరోపియన్ లగ్జరీ లెథర్ ఇంటీరియర్స్
- లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్
- గ్లోజీ ఫినిష్‌తో కూడిన ఉడెన్ సెంటర్ కన్సోల్
- డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్
- రూఫ్ మౌంటెడ్ డివిడి ప్లేయర్, 9 ఇంచ్ ఎల్‌సిడి స్క్రీన్
ఇంజన్ పరంగా స్పెషల్ ఎడిషన్ మహీంద్రా స్కార్పియోలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 120 పిఎస్‌ల శక్తిని, 290 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








