కేవలం 16 నెలల్లో 50,000 ఎక్స్‌యూవీ500ల అమ్మకం

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదలైన కేవలం 16 నెలల్లోనే 50,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిరుతపులి నుంచి స్ఫూర్తి పొంది, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో డిజైన్ చేసిన ఓ సరికొత్త ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రదర్శనకు ఉంచింది.

ఎమ్ అండ్ ఎమ్ తమ ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని తొలిసారిగా సెప్టెంబర్ 2011లో కేవలం రూ.10.8 లక్షల ప్రారంభ ధరకే మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది విడుదలైన కొత్తల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. దీని ఉత్పత్తి సామర్థ్యానికి మించి డిమాండ్‌ వస్తుండటంతో కంపెనీ కొంత కాలం బుకింగ్‌లు స్వీకరించడాన్ని కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. రెండవ సారి బుకింగ్‌లను ప్రారంభించినప్పుడు కూడా పాతిక వేలకు పైగా బుకింగ్‌లు రావటంతో లాటరీ ప్రకారం కొనుగోలుదారులను ఎంచుకుంది.

ఈ మోడల్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎక్స్‌యూవీ500 ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. మహీంద్రా ఎక్స్‌యూవీ500లో 2.2 లీటర్ ఎమ్‌హాక్ 140 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్‌లో ఉపయోగించిన 5వ తరం (ఫిఫ్త్ జనరేషన్) వేరియబల్ టర్బోఛార్జర్ ద్వారా ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది ప్రతి లీటరుకు 15 కి.మీ. (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) మైలేజ్‌ను ఇస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

మహీంద్రా ఎక్స్‌యూవీ500

More from DriveSpark

Article Published On: Friday, January 25, 2013, 13:21 [IST]
English summary
India's leading SUV manufacturer Mahindra and Mahindra's flagship SUV XUV500 has achieved another milestone. Within just 16 months, Mahnindra XUV500 sales crossed 50,000 units. The XUV500 SUV was first launched in India back in Sep 2011, with an introductory price tag of Rs 10.8 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+