మహీంద్రా అండ్ మహీంద్రా బుజ్జి కారు పేరు 'వెరిటో వైబ్'
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఏకైక సెడాన్ 'వెరిటో' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన చిన్న కారు (సబ్-ఫోర్ మీటర్ కారు)కు కంపెనీ పేరును ఖరారు చేసింది. చిన్న కార్లపై (నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండే కార్లపై) భారత ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందేందుకు గాను మహీంద్రా వెరిటో ప్లాట్‌ఫామ్‌పై పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా ఎమ్ అండ్ ఎమ్ రూపొందించిన చిన్న కారుకు 'వెరిటో వైబ్' (Verito Vibe) అనే పేరును ఖరారు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో చిన్నకార్లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో, ఈ సెగ్మెంట్లోని అవకాశాలను చేజిక్కుంచుకునేందుకు కంపెనీ ఈ సరికొత్త కాంపాక్ట్ కారును అభివృద్ధి చేసింది. మహీంద్రా వెరిటో వైబ్‌ను మే నెలలో మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ తెలిపింది. ఇందులో 1.5 లీటర్ డిసిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇది పొడవులో నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ మెరుగైన స్థలం మరియు సౌకర్యాన్ని ఇది ఆఫర్ చేస్తుంది. ఈ సరికొత్త వెరిటో వైబ్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ స్టయిలింగ్ ఫీచర్లను చూడొచ్చని కంపెనీ పేర్కొంది.
మహీంద్రా వెరిటో వైబ్ హ్యాచ్‌బ్యాక్/కాంపాక్ట్ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ వెబ్‌సైట్‌ను గమనిస్తూనే ఉండండి..!



Click it and Unblock the Notifications








