యూరప్ మార్కెట్ కోసం పవర్‌ఫుల్ మహీంద్రా ఈ2ఓ

By Ravi

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల విభాగం మహీంద్రా రేవా, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తొలి ఫోర్-సీటర్ ఎలక్ట్రిక్ కారు 'మహీంద్రా ఈ2ఓ'లో మరింత శక్తివంతమైన వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రత్యేకించి యూరప్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని, అక్కడి రోడ్లకు అనుగుణంగా ఎక్కువ పవర్, ఎక్కువ రేంజ్ ఇచ్చేలా ఓ పవర్‌పుల్ వెర్షన్ ఈ2ఓను మహీంద్రా రేవా తయారు చేస్తోంది.

ఎగుమతి మార్కెట్ల కోసం తయారు చేస్తున్న ఈ కొత్త మహీంద్రా ఈ2ఓ ఏప్రిల్ 2014 నాటికి మార్కెట్లోకి రావచ్చని సమాచారం. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మిడ్ రేంజ్ (50-60 కి.వా. లేదా 67-81 బిహెచ్‌పి) అలాగే హై రేంజ్ (80 కి.వా. లేదా 107 బిహెచ్‌పి, ఆపై) ఇంజన్లు (ఎలక్ట్రిక్ మోటార్లు) ఇప్పటికే అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. మిడ్ రేంజ్ ఇంజన్ కలిగిన ఈ2ఓను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది.


యూరప్ మార్కెట్ కోసం రేవా (మహీంద్రా స్వాధీనం చేసుకోకముందు) ఎన్ఎస్ఎక్స్ అనే కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. 2009లో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో రేవా ఈ కారును ఆవిష్కరించింది. అయితే, మహీంద్రా గ్రూప్ రేవా సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్ఎస్ఎక్స్ కారును విడుదల చేసే ప్లాన్‌ను విరమించుకుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న ఇండియన్ వెర్షన్ ఈ2ఓ ఎలక్ట్రిక్ కారులో 19 కి.వా. మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 3950 ఆర్‌పిఎమ్ వద్ద 19 కిలోవాట్ల గరిష్ట శక్తిని, 3400 ఆర్‌పిఎమ్ వద్ద 5.4 కెజిఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జ్‌పై 100 కిలోమీటర్ల దూరం పరుగులు తీస్తుంది.

Mahindra e20 Electric Car

కాగా, కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ పవర్‌ఫుల్ మహీంద్రా ఈ2ఓ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కానీ, భవిష్యత్తులో దేశీయ మార్కెట్ కోసం పవర్ స్టీరింగ్ ఆప్షన్‌తో ఈ2ఓ విడులయ్యే అవకాశం ఉంది. దీని అధిక కారణంగా దేశీయ విపణిలో రేవా ఎలక్ట్రిక్ కారు అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 29, 2013, 10:58 [IST]
English summary
Mahindra will start offering a more powerful version of Reva e2o in Europe soon, reports AutocarIndia. The e2o is a pure electric car that was launched by the Reva brand owned by Mahindra & Mahindra.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+